జీతం కావాలా.? జీవితమా.?

పొద్దున్నే ఫోన్ చేశాడు మా ఫ్రెండ్.. ‘మళ్లీ పిలుపొచ్చిందిరా.. వెళ్లితే బాగుటుందా..?’ అని.. డబ్బు మనిషినే ఎంత దూరమైన తీసుకెళ్తుంది. ఆ ఆశ ఉంది కాబట్టే వాడు మళ్లీ ఆశపడ్డాడు.. పాత జ్ఞాపకాలను వదిలేశాడు.. జీవితం గొప్ప పాఠం నేర్పినా కానీ వాడిలో మార్పు రాలేదు.. నిర్ధయగా గెంటేసినా పాత సంస్థపై ప్రేమ చావలేదు.. అందుకే 20 వేలు ఇస్తాననగానే బిస్కట్ వేసినట్టు ఊపుకుంటూ వెళతానన్నాడు..

ఇంతకుముందు పనిచేసిన పత్రిక యాజమాన్యం వాడిని నిర్దయగా ట్రాన్స్ ఫర్ పేరుతో రాష్ట్రానికి ఈ చివర ఖమ్మంలో ఉన్న వాడిని తిరుపతికి పంపించింది. భార్య, చిన్న పిల్లాడుతో అప్పుడే మొదలైన వాడి సంసారంలో ఇది పెద్ద అవరోధంగా నిలిచింది.. బతుకుజీవుడా అని ట్రాన్స్ ఫర్ లెటర్ చేత పట్టి హైదరాబాద్ లోని కేంద్ర కార్యాలయం చుట్టూ తిరిగాడు.. మఫిసిల్ ఎడిటర్ వద్ద కాళ్లావేళ్లా పడ్డాడు.. జీవితం గందరగోళమవుద్దని ప్రాధేయపడ్డాడు.. కానీ సంస్కరణలంటూ భ్రష్టుపట్టిన విధానాలను అమలు చేస్తూ సంస్థ సంకనాకిపోయేలా చేసిన ఆ పత్రిక యాజమాన్యం కరగలేదు.. వీడి ట్రాన్స్ ఫర్ రద్దు చేయలేదు..

ఇక భార్యపిల్లల్ని అత్తారింట్లో వదిలి.. నెల జీతంతో హైదరాబాద్ బాట పడ్డాడు.. ఫ్రెండ్ రూంలో ఉండి హైదరాబాద్లోని అన్ని న్యూస్ చానళ్లు, పత్రిక కార్యాలయాలకు తిరిగాడు. ఒక్క ఉద్యోగం అంటూ వాడు పడ్డ తాపత్రాయానికి తెలంగాణ చానల్ టీన్యూస్ కనికరించింది.. 15వేలతో ఉద్యోగం ఇచ్చింది.. సంవత్సరం గడిచింది. 20 వేలతో వాడి జీవితం ఇప్పుడు సాఫీగా సాగిపోతోంది.. భార్యపిల్లలతో ఖమ్మం వదిలి హైదరాబాద్ లో కులసాగా సాగిపోతోంది వాడి జీవితం..

ఇప్పుడు అన్నీ పొగొట్టికొని వలసలకు పాల్పడ్డ ఆ పత్రిక సంస్థకు మళ్లీ వీడి జీవితంతో ఆడుకోవాలనిపించింది అనుకుంటూ 20వేలు ఇస్తాం.. సొంత ఖమ్మంలో పొస్టింగ్ వస్తావా అనిడిగిందట.. సొంత జిల్లా.. అమ్మానాన్న ఉంటారని మనోడు ఆశపడి నాకు ఫోన్ చేశాడు.. జర్నలిస్టుల జీవితాలతో ఆటాలడి చిన్నాభిన్నం చేసిన ఆ పత్రికకు ఏదీ విశ్వసనీయత.. కనీసం ‘3 ఏళ్లు గ్యారెంటీ ఇవ్వమనరా.. నీ ఉద్యోగానికి అని చెప్పా’.. మాకే గ్యారెంటీ లేదు మీకు ఎలా ఇస్తాం అన్నాడట మఫిసిల్ ఎడిటర్..

చివరగా వాడికి చెప్పా.. ‘నీకు జీతం కావాలా.. జీవితం కావాలా తేల్చుకో’ అని..

-ఎ.న.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *