Breaking News

జీతంగా పాతనోట్లు.. సంస్థపై కేసు నమోదు..

1421756860-9352

ఉద్యోగికి నెల జీతం కింద రద్దైన పాత నోట్లను ఇచ్చిన సంస్థ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు. రూ.500, రూ.1000 నోట్లను ప్రభుత్వం ఇటీవల రద్దు చేసిన విషయం విదితమే. రద్దు చేసిన నోట్లను వేతనంగా తనకు చెల్లించిందని తాను పనిచేస్తున్న ముంబైలో ప్లాస్టిక్‌ వస్తువుల తయారీ సంస్థ యాజమాన్యంపై కంస్‌రాజ్‌ ప్రధాన్‌ అనే ఉద్యోగి ఫిర్యాదు చేశాడు. తన జీతం నెలకు రూ.12వేలు అని, సంస్థ రెండు వెయ్యి రూపాయల నోట్లు, 20 అయిదువందల రూపాయల నోట్లను ఇచ్చిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు.

తెలిసీ చేయడం మోసమే..
నోట్ల రద్దు విషయం తెలిసి కూడా పంపిణీ చేయడం మోసం కిందకు వస్తుందని, అందుకే ఆ సంస్థపై ఐపీసీ 420 సెక్షన్‌ ప్రకారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇటువంటి నేరాలకు పాల్పడేవారిపై చర్యలు తీవ్రంగా ఉంటాయని పోలీసులు హెచ్చరించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *