
ఎరువులపై 12 శాతం నుంచి 5 శాతం (2.5 శాతం కేంద్రం వాటా , 2.5 శాతం రాష్ట్ర వాటా) వరకు జీఎస్టీ వల్ల తగ్గిందని వ్యవసాయ ఉత్పత్తి కమిషనర్ & కార్యదర్యి పార్థసారథి తెలిపారు. ఈ విషయం రైతులందరికీ తెలియజేయడానికి విపరీత ప్రచారం చేపట్టాలన్నారు. వ్యవసాయ శాఖ కార్యాలయంలో జిల్లా వ్యవసాయ అధికారులతో గురువారం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ల ద్వారా ప్రెస్ నోట్ ఇప్పించాలన్నారు.. ఎరువుల సరఫరా చాలా పకడ్బందీగా, ప్రతి రోజు ఎక్కడా కూడా ఎరువుల కొరత లేకుండా నిరంతర పర్యవేక్షణ జరపాలన్నారు.. ఎరువుల కొరత ఎక్కడైన ఏర్పడినచో జిల్లా అధికారులే బాధ్యత వహించ వలసివస్తోందని పార్థసారథి హెచ్చరించారు.
సమగ్ర రైతు సర్వే రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా జరుగుచున్న కార్యక్రమము. కలెక్టర్ అప్రూవల్ తో రేపటి లోగా వ్యవసాయం కమిషనర్ కార్యాలయమునకు పంపాలని కోరారు. ముఖ్యమంత్రి కోరినట్లు ప్రతి జిల్లా నుండి 100 మంది రైతులను ఎంపిక చేసుకోవాలన్నారు. అన్ని మండలాలు, మెజారిటి ఆఫ్ క్లస్టర్స్ నుంచి రైతులు ఉండేటట్లు చూసుకోవాలన్నారు. వారు ఆదర్శ రైతులయి ఉండాలి. ముఖ్యమంత్రి గారి సందేశాన్ని జిల్లాలో రైతులందరికి చేరేవేయగలిగినవారై ఉండాలి. 30 జిల్లాల నుంచి దాదాపు 3 వేల మంది రైతులకు ముఖ్యమంత్రి గారి సందేశం ఇవ్వడం జరుగుతుందని, మీటింగ్ తేది త్వరలో తెలియజేస్తామన్నారు.
ప్రతి ఎఓ క్లస్టర్ హెడ్ క్వార్టర్ లో రైతు వేదిక ఏర్పాటు చేయబడుతుంది. దీని నిమిత్తం జిల్లా వ్యవసాయ అధికారులు అర ఎకరం స్థలాన్ని గుర్తించి రెవెన్యూ వారి ద్వారా పొంది ప్రతిపాదనలను కమీషనర్ గారికి పంపిస్తే మంజూరీ జరుగుతుందన్నారు. ఈ రైతు వేదికలో చిన్నగోడౌను, రైతు సమావేశాల నిమిత్తం చిన్న వేదిక , మినీ సాయిల్ టెస్టింగా ల్యాబ్ ను ఏర్పాటు చేసుకొనవచ్చన్నారు.