Breaking News

జిల్లా వ్యవసాయ అధికారులతో సమీక్షా సమావేశము

DSCN0471

జిల్లా వ్యవసాయ అధికారులతో సమీక్షా సమావేశము 15 ఫిబ్రవరి, 2017 న హైదరాబాదులోని జీడిమెట్ల సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ లో జరిగింది. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి, వ్యవసాయ శాఖ కార్యదర్శి సి. పార్థసారథి, ఐ.ఏ.ఎస్., హాజరు కాగా, వ్యవసాయ శాఖ కమిషనర్ డా. ఎం. జగన్ మోహన్, ఐ.ఏ.ఎస్., అధ్యక్షత వహించారు.

యాసంగి పంటల విస్తీర్ణాలను రైతుల వారీగా వివరాలను ఖచ్చితత్వంతో సేకరించాలని వ్యవసాయ శాఖ మంత్రి ఆదేశించారు. రైతు వారీగా, పట్టాదారువారీగా భూమి వివరాలను, పంట సాగు విస్తీర్ణ వివరాలను సేకరించాలని ఆదేశించారు. వ్యవసాయ శాఖ సేవలను సమర్థవంతంగా ఉపయోగించుకొని రైతు వారీ వివరాలను సూక్ష్మంగా సేకరించాలని ఆదేశించారు. ఇదే సందర్భంలో వ్యవసాయ కార్యదర్శి, కమిషనర్ వ్యవసాయ శాఖ అమలు చేస్తున్న పలు పథకాల గురించి జిల్లా వ్యవసాయ అధికారులతో సమీక్షించారు.

రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ విస్తరణాధికారులు, కొత్తగా నియమితులైన 1311 వ్యవసాయ విస్తరణాధికారుల సేవలను వినియోగించుకోవాలని ఈ సందర్భంగా మంత్రి రైతులను కోరారు. ప్రభుత్వం చేపడుతున్న పథకాలు రైతులకు చేరినప్పుడే మంచి ఫలితాలు వస్తాయని ఆ దిశగా వ్యవసాయ శాఖ నడుము బిగించి కృషి చేయాలని మంత్రి కోరారు.

ఈ సమావేశంలో ఇక్రిసాట్ (ICRISAT) నుండి వచ్చిన శాస్త్రవేత్త శ్రీకాంత్ ఐ-హబ్ గురించి వివరించారు. అలాగే ప్రొ. జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం నుండి విచ్చేసిన ప్రధాన శాస్త్రవేత్త ఎస్.జె. రహమాన్, పత్తి పంటలో నష్టం చేస్తున్న గులాబి రంగు పురుగు నివారణ, యాజమాన్య పద్ధతులను వివరించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *