
జిల్లా పోలీసు అధికారుల అసోసియేషన్ ఆద్వర్యంలో రూపొందించిన 2015 క్యాలెండర్ ను శుక్రవారం నాడు జిల్లా ఎస్పీ వి.శివకుమార్ ఆవిష్కరించారు. మల్టీ కలర్ లో ఆకర్షణీయంగా రూపొందించిన ఈ క్యాలెండర్ లో సాధారణ, ఐచ్చిక సెలవుల వివరాలను పేర్కొన్నారు. పోలీసులకు ఉపయోగకరంగా రూపొందిచబడిన ఈ క్యాలెండర్ ను జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ లకు ఉచితంగా అందజేయనున్నారు. ఈ కార్యక్రమంలో రిజర్వ్ ఇన్స్ పెక్టర్ గంగాధర్, అసోసియేషన్ అధ్యక్షులు యం.సురేందర్, ఉపాధ్యక్షులు సి.హెచ్.సాగర్, రాష్ట్ర్ర కార్యవర్గ సభ్యులు ఎస్.రవికాంత్, అసోసియేషన్ ప్రతినిధులు అల్తాఫ్ ఖాన్, పద్మ, మల్లయ్య, లింగమూర్తి, రవి తదితరులు పాల్గొన్నారు.
బాలల హక్కులపై వాల్ పోస్టర్ ఆవిష్కరణ
బాలల హక్కులపై మారి స్వచ్చంద సంస్ధ రూపొందిన వాల్ పోస్టర్లను శక్రువారం నాడు జిల్లా ఎస్పీ వి.శివకుమార్ ఆవిష్కరించారు. ‘బాలలందరినీ బడిలో చేర్పిద్దాం’.బాలల కార్మిక వ్యవస్ధను నిర్మూలిద్దాం’.పుస్తకాలు మోసే వయస్సులో పనిభారం వద్దు’ల పేరిట 6 రకాల మల్టీకలర్ తో ఈ పోస్టర్లను రూపొందించారు. బాల కార్మిక వ్యవస్ధ నిర్మూలన కోసం మారి స్వచ్చంద సంస్ధ నిర్వహిస్తున్న కార్యక్రమాలను ఎస్పీ అభినందించారు. జిల్లా పోలీస్ శాఖ తరపున సహకారం అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్ధ జిల్లా ప్రాజెక్ట్ కో-ఆర్డినేటర్ ఎ.శ్రీనివాస్. విద్య విభాగం కో-ఆర్డినేటర్ ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కవిత సంకలనం ఆవిష్కరణ
మానవ విలువల పరిరక్షణ సేవాసమితి వ్యవస్ధాపకులు, కవి నాగుల. సత్యం గౌడ్ నూతన సంవత్సర సందర్భాన్ని పురస్కరించుకుని రూపొందించిన ‘స్వార్ధాన్ని వదులుకోవడమే లోకకళ్యాణం’కవిత సంకలనాన్ని శుక్రువారం నాడు జిల్లా ఎస్పీ వి.శివకుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మానవతా విలువలను పరిరక్షించేందుకు రచనలు చేస్తున్న కవి సత్యం గౌడ్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్.సి. ఎస్.టి సంక్షేమ సంఘం రాష్ట్ర్ర అదనపు కార్యదర్శి దొంత రాజయ్య, ఉపాధ్యక్షులు అంజయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.