జిల్లా కలెక్టర్లతో మంత్రి కేటీఆర్ వీడియో కాన్ఫరెన్సు

 

సూక్ష్మ ,చిన్న తరహా పరిశ్రమలు, గనులు శాఖపైన మంత్రి కెటి రామరావు జిల్లా కలెక్టర్లతో శనివారం విడియో కార్ఫరెన్సు  నిర్వహించారు. మెన్న జరిగిన రాష్ర్టస్ధాయి బ్యాంకర్ల సమావేశంలో తీసుకున్న పలు నిర్ణయాల నేపథ్యంలో ఈరోజు ఈ  సమావేశం జరిగింది. చిన్న పరిశ్రమలను అదుకునేందుకు ప్రతి నెలకొకసారి జిల్లా స్ధాయిలో కలెక్టర్లు సమావేశం నిర్వహించాలని, ఈ సమావేశంలో చిన్న పరిశ్రమలు ఖాయిలా పడకుండా వాటికున్న సమస్యలను పరిష్కారించాలన్నారు. జిల్లా స్ధాయిలోనే బ్యాంకర్లతో సమావేశాలు ఎర్పాటు చేయాలని, తద్వరా చెల్లింపుల్లో కొంత అలస్యానికే ఖాయిలా(సిక్) యూనిట్ గా మారకుండా చూడాలన్నారు. ఈ అర్ధిక సంత్సరాంతానికి కనీసం రెండుసార్లు ముద్రా లోన్ల మేళాలు నిర్వహించాలని కలెక్టర్లకు మంత్రి అదేశాలు జారీ చేశారు.

నిన్న గనుల శాఖపై సమీక్ష నిర్వహించిన మంత్రి, ఈ రోజు కలెక్టర్లకు పలు అదేశాలు జారీ చేశారు. అక్రమ మైనింగ్, అక్రమ ఇసుక రవాణాపైన కలెక్టర్లు దృష్టి సారించి , కఠినంగా వ్యవహారించాలన్నారు. ప్రభుత్వ విధానాలతో గత దశాబ్దకాలంగా పాత ప్రభుత్వాల్లో వచ్చిన రెవెన్యూ కన్నా అనేక రెట్లు ప్రస్తుతం ప్రభుత్వ ఖజానాకు చేరుతుందని మంత్రి తెలిపారు. ఇదే సమయంలో సాదారణ ప్రజలకు ఇసుక అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం తాజాగా ఈ సేవ సెంటర్ల ద్వారా ఇసుక బుక్ చేసుకునేందుకు అవకాశం ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుందని మంత్రి తెలిపారు. ప్రభుత్వానికి అదాయం, ప్రజలకు అందుబాటులో ఇసుక అనే రెండు ప్రధానమైన అంశాల మీద ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఇప్పటికే గద్వాలా, పెద్దపల్లి, మహబూబ్ నగర్ వంటి జిల్లాల్లో ఇసుక రవాణాలో అయా జిల్లాల కలెక్టర్లు పలు అద్బుతమైన కార్యక్రమాలు చేపట్టారని, వాటిని ఇతర జిల్లాల కలెక్టర్లు సైతం అమలు చేయాన్నారు. ఇసుక అక్రమ రవాణ అరికట్టేందుకు డిజిపి ప్రత్యేకంగా మరోసారి సమావేశం అవుతారని మంత్రి తెలిపారు. దీంతోపాటు ప్రతి జిల్లాలోని డిస్ర్టిక్ట్ మినరల్ పౌండేషన్ గవర్నింగ్ కౌన్సిళ్లను ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు అదేశాలు జారీ చేశారు. డియంయఫ్ కు అందుబాటులో ఉన్న నిధులను ఖర్చు చేసేందుకు ప్రభుత్వం త్వరలోనే మార్గదర్శకాలను విడుదల చేస్తుందని, ఈ పనుల ద్వారా మైనింగ్ జరిగే ప్రాంతాల్లో అనేక అభివృద్ది కార్యక్రమాలను చేపట్టవచ్చన్నారు.

IMG-20180113-WA0202IMG-20180113-WA0201

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *