Breaking News

జిల్లాల విభజన ఇప్పట్లో లేనట్టే.!

Proposed-24-Districts-Of-Telangana1

హైదరాబాద్, ప్రతినిధి : తెలంగాణ ఏర్పాటు తర్వాత ఇప్పుడున్న 10 జిల్లాలను 24 జిల్లాలు చేయాలన్న తెలంగాణ సర్కారు ప్రయత్నాలు ఫలించేటట్టు లేవు. జిల్లాల సంఖ్యను పెంచాలని ఇటీవల ఢిల్లీ వెళ్లిన సీఎం కేసీఆర్ కేంద్ర ఎన్నికల కమిషన్ కలిసి జిల్లాల సంఖ్యను పెంచాల్సిందిగా సూచించారు. కానీ ఆయన దీనికి ఒప్పుకోలేదు. కేంద్రం జిల్లాల పునర్విభజనపై చట్టం చేసిందని .. మళ్లీ 2026 కే జిల్లాల సంఖ్యను పెంచుతామని స్పష్టం చేశారు. దీంతో తెలంగాణ జిల్లాల పెంపు అంశం అటకెక్కింది.

కాగా తెలంగాణ సర్కారు ఆర్డినెన్స్ ద్వారా జిల్లాల సంఖ్యను పెంచాలని యోచిస్తుంది. ఆర్డినెన్స్ తెచ్చి పార్లమెంటులో బిల్లు పాస్ చేయించుకుంటే జిల్లాల సంఖ్య పెంచుకోవచ్చని యోచిస్తోంది.

ఇప్పుడున్న పదిజిల్లాల్లో హైదరాబాద్ ను 5 జిల్లాలుగా విభజించాలని యోచిస్తోంది. అవి హైదరాబాద్ తూర్పు, సెంట్రల్ , చార్మినార్, సికింద్రాబాద్, గోల్కొండలుగా విభజించాలని ప్రతిపాదనలు సిద్ధం అయ్యాయి. ఇక జిల్లాల్లో ఆదిలాబాద్ నుంచి మంచిర్యాల, కరీంనగర్ నుంచి జగిత్యాల, వరంగల్ నుంచి ఒక జిల్లా, మెదక్, నిజామాబాద్, నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి నుంచి ఒక్కో జిల్లా ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్దం అయ్యాయి.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *