పోలీస్ స్టేషన్లకు మహర్దశ

హైదరాబాద్, ప్రతినిధి : తెలంగాణలో ఏర్పడిన కేసీఆర్ ప్రభుత్వం పోలీసుల దశ మారుస్తోంది. ఎవరూ పట్టించుకోని.. ఎవరూ పైసా విదిల్చని పోలీసు వ్యవస్థ ప్రక్షాళనకు నడుం బిగించింది. కేసీఆర్ చేపడుతున్న సంస్కరణల పుణ్యమాని పోలీసులు ఎన్నడూ లేనంత సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

కేసీఆర్ పగ్గాలు చేపట్టగానే పోలీస్ సంస్కరణలకు పెద్దపీట వేశారు. పోలీసులకు కొత్త వాహనాలను హైదరాబాద్ పరిధిలో ఇచ్చారు. అది సత్ఫలితాలు ఇవ్వడంతో ఇక జిల్లాల్లోని పోలీస్ స్టేషన్లకు సైతం పోలీస్ వాహనాలను అందించారు. ఈ రెండు రోజుల్లో అవి జిల్లాల్లోని ప్రతీ పోలీస్ స్టేషన్ కు అందాయి. వీటిని జిల్లాల్లో ఆయా మంత్రులు ప్రారంభించి పోలీసులకు అందించారు. అంతేకాదు.. ఇక నుంచి వీటి నిర్వహణకు గాను రూరల్ పోలీస్ స్టేషన్లకు రూ.25 వేలు.. నగర స్టేష్టన్లకు 50వేల రూపాయలను నెలనెలా ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

ఈ వాహనాలు ఇవ్వడంతో పోలీసులకు కొత్త బలం వచ్చినట్టైంది. ఇన్నాళ్లు సొంత వాహనాలు.. కాలం చెల్లి న జీపులతో నేరాల అదుపులో వెనకబడ్డ పోలీసులు ఈ కొత్త వాహనాల రాకతో తమ కొరఢా జులిపిస్తున్నారు. నగరంలో ఎక్కడ చూసినా చెకింగ్ లు.. క్షేత్ర పర్యటనలతో దోపిడీ, దొంగతనాల అరికట్టడుతుండడంతో దొంగల్లో వణుకు మొదలవుతోంది. దీంతోపాటు నేరాల సంఖ్య కూడా గణనీయంగా తగ్గుతోంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *