జిల్లాలో 20,049 హెక్టార్లలో పంట నష్టం; జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్

ఏప్రిల్ 15, కరీంనగర్ జిల్లాలో ఇటీవల కురిసిన ఆకాల వర్షాలకు, వడగండ్ల వానలకు 20,049 హెక్టార్లలో పంట నష్టం సంభవించిందని ఫ్రాథమిక అంచనా వేసినట్లు జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ తెలిపారు. బుధవారం ఆర్.ఆర్.బి.అతిధి గృహంలో కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి బండారు దత్తాత్రేయకు పంట నష్టం గురించి వివరించారు. 7395 హెక్టార్లలో వరి, 788 హెక్టార్లలో మొక్క జోన్న, 1565 హెక్టార్లలో సజ్జలు, 5643 హెక్టార్లలో నువ్వులు, 10 హెక్టార్లలో పెసలు మొత్తం 15,403 హెక్టార్లలో పంటనష్టం జరిగినట్లు ఫ్రాథమికంగా అంచన వేసినట్లు తెలిపారు. తేది 6,7,11,13 తేదిలలో కురిసిన వర్షాలలో పంట నష్టం జరిగినట్లు ఫ్రాథమికంగా అంచన వేసినట్లు తెలిపారు. ఉద్యానవన పంటలలో మామిడి 4407, అరటి 141 హెక్టార్లలో, బోప్పయి 73 హెక్టార్లలో, కూరగాయలు 25 హెక్టార్లలో, మొత్తం 4646 హెక్టార్లలో నష్టం జరిగినట్లు తెలిపారు. ప్రభుత్వం ప్రోత్సహంతో జిల్లాలో రైతులు ఎక్కువగా

ఉద్యానవన పంటలను సాగు చేశారని తెలిపారు. రాష్ట్రా ప్రభుత్వం ప్రస్తుతం ఎకరానికి 10 వేల రూపాయలు, మొక్కజోన్నకు 7 వేల రూపాయలు, మామిడికి 15,000రూ.లు నష్ట పరిహరం చెల్లిస్తుందని తెలిపారు. ఇండ్లు కోల్పోయిన వారికి ఇందిర ఆవాస యోజన క్రింద ఇండ్లను నిర్మించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు వివరించారు.
ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ ఎం.ఎల్.ఎ. రామచంద్రయ్య, జె.సి.పౌసమిబాస్, ఆర్.డి.ఓ. చంద్రశేఖర్, అధికారులు పాల్గోన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *