జిల్లాలో సీజనల్ వ్యాధుల నివారణకు చర్యలు తీసుకుంటున్నాం

కరీంనగర్: జిల్లాలో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు కరీంనగర్ జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ తెలిపారు. గురువారం వివిధ శాఖల అధికారులతో క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ వర్షాలు పడగానే సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని అన్నారు. అందుకు గాను ఒకవారం రోజుల పాటు అన్ని గ్రామ పంచాయితీలు, పట్టణాలలో ఆరోగ్యం, పరిశుభ్రత వారోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. గ్రామాలలో గ్రామ సర్పంచు, కార్యదర్శులు, అంగన్ వాడి కార్యకర్తలు, ఎ.ఎన్.ఎం.లు, గ్రామ రెవెన్యూ అధికారులు, ఆశా వర్కర్లు పరిశుభ్రత పైన ప్రజలకు అవగాహన కల్పిస్తారని తెలిపారు. వ్యాధులు రాకుండా ముందస్తు జాగ్రత్తల గురించి ప్రజలకు వివరిస్తారని తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ, పంచాయితీరాజ్ శాఖ వారోత్సవాల పై షెడ్యూలును విడుదల చేస్తారని అన్నారు. ప్రతి గ్రామ పంచాయితికి 5000 రూపాయల కేటాయించనున్నట్లు తెలిపారు. వీటితో గ్రామంలో బ్లీచింగ్ పౌడరు, స్పేృలను కొనుగోలు చేసుకోవచ్చని అన్నారు. అన్ని మురికి కాలువలను, మంచినీటి ట్యాంకర్లను శుభ్రపరుస్తారని అన్నారు. ప్రాధమిక వైద్య కేంద్రంలో వైద్యులు, పారా మెడికల్ సిబ్బంది సిద్దంగా ఉండాలని అన్నారు. సాధారణంగా వచ్చే వ్యాధులకు సంబంధించిన మందులను అన్ని వైద్య కేంద్రాలలో అందుబాటులో ఉంచుతున్నామని అన్నారు. గతంలో అనుభవాలను దృష్టిలో వుంచుకుని వ్యాధులు ప్రబలే ప్రాంతాలను గుర్తించి ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మారుమూల ప్రాంతాలలో ప్రత్యేక దృష్టి పెడుతున్నామని తెలిపారు. 108 సర్వీసులు ప్రజలకు అందుబాటులో ఉండాలి: 108 అంబులెన్సు లో అన్ని సౌకర్యాలు సిద్దంగా ఉండాలని అన్నారు. జిల్లాలో 32 అంబులెన్సులు ఉన్నాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల నుండి ఫోన్ కాల్ రాగానే వెంటనే స్పందించాలని 108 సిబంబందిని ఆదేశించారు. గర్భిణి స్త్ర్రీలను ఆస్పత్రులకు తీసుకువెళ్లె ఫ్రిక్వెన్సిని పెంచాలని అన్నారు. ఆస్పత్రులలో ముందుగా సమాచారాన్ని సేకరించి ప్రసవం అనంతరం తల్లి, బిడ్డలను వారి ఇండ్లకు చేర్చాలని అన్నారు. రోగులను ప్త్ర్రెవేటు ఆస్పత్రులకు పంపినట్లు తెలిస్తే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వం ఆస్పత్రులలో కల్పిస్తున్న సౌకర్యాల గురించి రోగులకు వివరించి వారిని ప్రభుత్వ ఆస్పత్రులకు చేర్చాలని అన్నారు. గర్భిణి స్త్ర్రీలు నెలసరి పరీక్షలకు 108 సేవలను ఉపయోగించు కోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి రాజేశం, సిపిఒ సుబ్బారావు, డిఆర్ డిఎ పిడి అరుణశ్రీ, ఐసిడిఎస్ పిడి వసంత, 108 రిజినల్ మేనేజర్ భవిత,
108 జిల్లా కో- ఆర్డినేటర్ జితేందర్, ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *