
కరీంనగర్: జిల్లాలో తాగునీటి సమస్య లేకుండా అన్ని రకాల చర్యలను తీసుకుంటున్నామని కరీంనగర్ జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ తెలిపారు. బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో వాటర్ గ్రిడ్, తాగునీటి పధకంపై అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో నాన్ సి.ఆర్.ఎఫ్. కింద 994 బోరు బావులకు డిపెనింగ్ చేయాలని లక్ష్యంగా నిర్ధేశించగా 510 బోరు బావుల డిపెనింగ్ పూర్తి చేసినట్లు తెలిపారు. 461 పనుల ప్రగతిలో ఉన్నాయని తెలిపారు. తాగునీటి రవాణను సైంటిఫిక్ గా చేయాలని సూచించారు. అవసరమైన చోట మాత్రమే రవాణ చేయాలని అన్నారు. వాటర్ గ్రిడ్ పనులను నిర్ణిత గడువు లోపల పూర్తి చేయాలని తెలిపారు. భూ సేకరణలో సమస్యలేమైన ఉన్నట్లయితే వెంటనే పరిష్కరించుకోవాలని కోరారు. వాటర్ గ్రిడ్ పైప్ లైన్ నిర్మాణ పనులు పూర్తి చేయాలని తెలిపారు. పైప్ లైన్ నిర్మాణం చేయవలసిన ప్రాంతాలలో రైతులు పంటలను వేయకుండా ముందు జాగ్రత్తగా కంచేలు వేయాలని సూచించారు. అవసరమైన ప్రాంతాలలో తాగునీటి ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నామని తెలిపారు. ప్త్ర్రెవేటు బోర్లను అద్దెకు తీసుకొని తాగునీరు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్.ఇ. వాటర్ గ్రిడ్ శ్రీనివాస్, ఎస్.ఇ. ఆర్. డబ్ల్యు. ఎస్. సూర్య ప్రకాశ్ ఇ.ఇ.లు, పాల్గొన్నారు.