జిల్లాలో కోటి మొక్కలు నాటాం: జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్

కరీంనగర్: రాష్ట్ర్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ హరితహరం కార్యక్రమంలో భాగంగా జిల్లాలో కోటి మొక్కలు నాటడం పూర్తిచేశామని కరీంనగర్ జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ తెలిపారు. గురువారం ప్రపంచ పారిశుద్ద్య దినోత్సవం సందర్భంగా కలెక్టరేటులో స్వచ్చ భారత్ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్, జిల్లా అధికారులు, ఉద్యోగులతో కలిసి కలెక్టరేటు ఆవరణలో పిచ్చి మొక్కలను, చెత్తను తొలగించి పరిసరాలను శుభ్రపరిచారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన హరితహరం కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని అన్ని ప్రాంతాలలో ప్రజల భాగస్వామ్యంతో కోటి మొక్కలు నాటామని తెలిపారు. ఇందులో డ్వామా ద్వారా 70 లక్షల 60 వేల మొక్కలు, అటవీ శాఖ ద్వారా 8 లక్షల 50 వేల మొక్కలు, సింగరేణి సంస్ధ ద్వారా 8 లక్షల మొక్కలు, ఎన్.టి.పి.సి ద్వారా 2 లక్షల మొక్కలు, కేసోరాం ద్వారా 1 లక్ష 20 వేల మొక్కలు, పోలీసు శాఖ ద్వారా 1 లక్ష 50 వేల మొక్కలు, ఎక్సైజ్ శాఖ ద్వారా 1 లక్ష 20 వేల మొక్కలు, సెరికల్చర్ ద్వారా 4 లక్షల 50 వేల మొక్కలు, స్ధానిక సంస్ధల ద్వారా 2 లక్షల 50 వేల మొక్కలు నాటామని తెలిపారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా కలెక్టరేటులో కోటి ఒకటవ మొక్కను జిల్లా కలెక్టర్, కోటి రెండవ మొక్కను జాయింట్ కలెక్టర్ నాటినట్లు కలెక్టర్ తెలిపారు. కలెక్టరేటులోని హెలిప్యాడ్ పార్క్ లో మూడు హెలిక్యాప్టర్లు దిగుటకు హెలిప్యాడ్ లు ఉన్నాయని తెలిపారు. హెలిప్యాడు పార్కు లో మంచి పూల చెట్లు ఇతర మొక్కలు పెంచి కలెక్టరేటు ఉద్యోగులకు, ప్రజలకు ఆహ్లదాన్ని ఇచ్చే రీతిలో అభివృద్ధి చేస్తామని తెలిపారు. అనంతరం కలెక్టరేటులో ఏర్పాటు చేసిన గాంధీ విగ్రహన్ని నీటితో శుభ్రపరచి పూల మాలలు వేసి నివాళులర్పించారు.

1.56 కోట్లతో కలెక్టరేటు ఆధునీకరణ:

12

30 సంవత్సరాల క్రితం నిర్మించిన కలెక్టరేటులోని కొన్ని బ్లాకులు శిధిలావస్ధకు చేరినందున కలెక్టరేటుకు మరమ్మత్తులు చేసి పూర్తి స్ధాయిలో ఆధునీకరించుటకు రాష్ట్ర్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు కేటాయించిన అత్యవసర నిధుల నుండి కోటి 56 లక్షల మంజూరు చేసినట్లు తెలిపారు. టెండర్లు పూర్తి అయినాయని త్వరలో పనులు ప్రారంభించి 3-4 నెలలలో పూర్తి చేస్తామని తెలిపారు.

ఎన్.టి.పి.సి వారిచే ఆడిటోరియం ఆధునికరణ:

18

కలెక్టరేటులో గల ఆడిటోరియంను 30-40 లక్షలతో పూర్తిస్ధాయి ఆధునీకరించుటకు ఎన్.టి.పి.సి ముందుకు వచ్చిందని కలెక్టర్ తెలిపారు. త్వరలో ఆడిటోరియం ఆధునీకరణ పనులు ప్రారంభిస్తామని తెలిపారు. కలెక్టరేటు మరమ్మత్తు పనులు పూర్తి అయిన తర్వాత కలెక్టరేటుకు కొత్త శోభ వస్తుందని ఇంకో 15-20 సంవత్సరముల వరకు పటిష్టంగా ఉంటుందని తెలిపారు.

ఆంధ్రా బ్యాంకు వారిచే 150 ట్రీ గార్డులు:

14

హరితహరంలో భాగంగా నాటిన మొక్కలను రక్షించుటకు ఆంధ్రా బ్యాంకు వారు 150 ట్రీ గార్డులను అందించినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రా బ్యాంక్ డిజిఎం సత్యనారాయణ కలెక్టరేటులో 150 ట్రీ గార్డులను కలెక్టరుకు అందించారు. ఇదే విధంగా స్టేట్ భ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ వారు కూడా 500 ట్రీ గార్డులు ఇచ్చుటకు ముందుకు వచ్చినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పౌసుమి బసు, ఎజెసి డా. నాగేంద్ర, జిల్లా రెవెన్యూ అధికారి టి. వీరబ్రహ్మయ్య, డిఎఫ్ఒ లు నర్సయ్య, వెంకటేశ్వర్టు, హౌజింగ్ పిడినర్సింహరావు, డ్వామా పిడి గణేష్, జిల్లా విద్యాధికారి లలితాదేవి, డి.ఆర్.డి.ఎ. పిడి అరుణశ్రీ, బిసి కార్పోరేషన్ ఎడి ఇందిర, టి.పి.ఎం.ఐ.పి. సంగీత లక్ష్మీ, డి.పి.ఒ. కుమార స్వామి, డి.పి.ఆర్.ఒ. ప్రసాద్ డి.టి.డబ్ల్యూ.ఒ. చంద్రశేఖర్, కలెక్టరేటు ఎఒ రాజాగౌడ్, తదితరులు పాల్గొన్నారు.

DSC_0191

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *