
జిల్లాలోని ప్రతి గ్రామానికి ఆర్టీసీ బస్సులు నడపాలి
ఆర్టీసీ కార్గో సేవలను అధికారులు వినియోగించుకోవాలి
జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్
. ——————
జిల్లాలోని ప్రతి గ్రామంచాయితీకి ఆర్టీసి బస్సు సర్వీసులను నడపాలని జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ అన్నారు.
బుదవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటి సమావేశంలో జరిగింది. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి గ్రామపంచాయితీకి ఆర్టీసి సర్వీసులు వెళ్లి ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చాలని అన్నారు. బస్టాండ్ పరిసర ప్రాంతాలలో వైట్ ప్లేట్ వాహనాలు ప్రయాణీకులకోసం రాకుండా పటిస్టచర్యలు తీసుకోవాలని పేర్కోన్నారు. పోలీసు, ఆర్టీఓ అధికారుల సమన్వయంతో స్థానికంగా కాకుండా దూరప్రాంతాలకు వెళ్ళే ప్రైవేటు టాటాఏసి, ఆటో మొదలగు వాటిలో పరిమితికి మించి ప్రయాణాలు జరిగినట్లయితె వాటిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆర్టీసి కార్గో ద్వారా మంచి సేవలను అందిస్తుందని వాటిని మరింత మెరుగుపరిచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్గో సేవలను అన్నారు.
ఈ సమావేశంలో పోలీస్ కమీషనర్ వి.సత్యనారాయణ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్, డిసిపి అడ్మిన్ చంద్రమోహన్, ఆర్టీసి రీజనల్ మేనెజర్ ఖుస్రో షా ఖాన్, డిప్యూటీ ఆర్ఎం ఎన్. చందర్ రావు, విజిలెన్స్ సెక్రటరీ యం . రవీందర్, మున్సిపల్ కమీషనర్ సేవా ఇస్లావత్ లు, ఎం వి ఐ మసూద్ అలీ పిఆర్ఓ మల్హల్ రావు తదితరులు,పాల్గోన్నారు.