Breaking News

జియాఖాన్ చనిపోయే అంతసేపు మాట్లాడింది..

17714-jiah-khan.jpg

ముంబై : సంచలనం కలిగించిన హీరోయిన్ జియాఖాన్ ఆత్మహత్యపై ఓ చీకటి కోణం బయటపడింది.. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు రోజు రాత్రి ఆమె సూరజ్ పాంచోలీకి ఫోన్ చేసిందని ఆ కాల్ దాదాపు 400 నిమిషాల పాటు కొనసాగిందని సీబీఐ చెబుతోంది..

నటుడు సూరజ్ పాంచోలితో సంబంధాలు చెడిపోవడంతో ఆమె 2013 జూన్ 3న ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపింది. ఫోరెన్సిక్ మెడిసన్ నిపుణులు ఆమె మరణానికి కారణం ఆత్మహత్యేనని తేల్చారని.. పోస్టు మార్టం చేసిన వైద్యుడి నివేదికతో కూడా ఆత్మహత్యేనని సరిపోయిందని సీబీఐ స్పష్టం చేసింది.. సంతకం పెట్టకుండా మూడు పేజీలతో రాసిన ఆ లేఖ ఆమె మానసిక స్థితికి అద్దం పడుతోందని సీబీఐ తెలిపింది..

ప్రేమ విఫలమై వర్ధమాన నటి ఇలా అర్థాంతరంగా తనువు చాలించడం ఆమె కెరీర్ ను నాశనం చేసింది..కొంచెం మెచ్చూరిటీగా ఆలోచిస్తే ఆమెకు ఈ కష్టం తప్పి ఉండేది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *