
జింబాబ్వే టూర్ కు భారత క్రికెట్ సెలక్షన్ కమిటీ ద్వితీయ శ్రేణి జట్టును పంపుతోంది. జింబాబ్వే పర్యటనలో భారత జట్టు 3 వన్డేలు, 2 ట్వంటీ మ్యాచ్ లు ఆడుతుంది. కాగా జింబాబ్వే పర్యటనకు భారత జట్టు సీనియర్లకు పూర్తిగా విశ్రాంతినిచ్చారు. ధోని, ధావన్, కోహ్లీ, రైనా, రోహిత్ లకు విశ్రాంతినిచ్చారు.కెప్టెన్ గా రహానేను నియమించారు. హర్భజన్ కు అవకాశమిచ్చింది.
జింబాంబ్వే టూర్ కు భారత క్రికెట్ జట్టు:
రహానే (కెప్టెన్), రాయుడు, ఊతప్ప, విజయ్, హర్భజన్,మనోజ్ తివారీ, కేదార్ జాదవ్, మనీష్ పాండే, అక్షర్ పటేల్, కరణ్ శర్మ, ధవల్ కులకర్ణి, స్టువర్ట్ బిన్ని, భువనేశ్వర్ కుమార్, మోహిత్ శర్మ, సందీప్ శర్మ.