
జైపూర్, ప్రతినిధి : సల్మాన్ కు షాక్ ఇచ్చింది సుప్రీం కోర్టు. జింకను వేటాడిన కేసును మళ్లీ విచారించాలని రాజస్థాన్ హైకోర్టును ఆదేశించింది. సల్మాన్ జైలు శిక్షను రిజర్వ్ లో పెడుతూ రాజస్థాన్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. గతంలో జింకను వేటాడిన కేసులో స్పెషల్ కోర్టు సల్మాన్ కు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ శిక్షను రాజస్థాన్ హైకోర్టును రిజర్వ్ లో పెట్టింది. సల్మాన్ విదేశాలకు వెళ్లేందుకు రాజస్థాన్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కొట్టివేసింది. తీర్పుకు సంబంధించి సల్మాన్ రాజస్ధాన్ హైకోర్టుకు వెళ్లొచ్చని సుప్రీం చెప్పింది. 1998 లో జింకలను వేటాడినట్లు సల్మాన్ పై కేసు ఉంది.