జాబ్ క్యాలెండర్ రూపొందించి అమలు చేయాలి: కోదండరామ్

జాబ్ క్యాలెండర్ రూపొందించి అమలు చేయాలి: కోదండరామ్

తెలంగాణ రాష్ట్ర్రంలో ఉద్యోగ ఖాళీలన్నింటిని భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేయాలని ఉద్యోగ నియామకాలకు సంబంధించిన జాబ్ క్యాలెండర్ ను రూపొందించి అమలు చేయాలని తెలంగాణ జెఏసి రాష్ట్ర్ర ఛైర్మన్ కోదండరామ్ డిమాండ్ చేశారు. కరీంనగర్ ప్రెస్ భవన్ లో సోమవారం నాడు జరిగిన నిరుద్యోగ నిరసన ర్యాలి సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇంటికో ఉద్యోగం, లక్ష ఉద్యోగాల నియామకాలపై ప్రభుత్వం ఇచ్చిన హమి ని వెంటనే అమలు చేయాలన్నారు. ప్రయివేటు రంగంలోని ఉద్యోగ నియామకాల్లో స్దానిక రిజర్వేషన్లు అమలు చేయాలని కోదండరామ్ కోరారు. గురుకులాల నోటిఫికేషన్ ను సవరించాలన్నారు. ప్రభుత్వం ఇప్పటివరకు నియమించిన ఉద్యోగాలు ఐదారు వేలకు మించిలేవన్నారు. సిరిసిల్ల టెక్స్ టైల్స్ పార్కులో 230 కంపెనీల ఏర్పాటుకు అవకాశం ఉన్నా కేవలం 114 కంపెనీలు మాత్రమే ఏర్పాటు అయ్యాయన్నారు. ఇక్కడి కంపెనీలకు రాయితీలు ఇస్తే 10 వేల మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నారు. 15 కోట్ల రూపాయలు ఇక్కడి కంపెనీలకు ఇస్తే అవి బాగు పడతాయన్నారు. బతుకమ్మ కు కేటాయించిన నిధుల్లో సగం ఇచ్చినా ఇక్కడ వేలాది కుటుంబాలు బాగుపడతాయన్నారు. ఈ నెల 22 న జరిగే నిరుద్యోగ నిరసన ర్యాలికి అధిక సంఖ్యలో తరలి రావాలని కోదండరాం పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జేఏసి రాష్ట్ర్ర కన్వీనర్ పిట్టల రవీందర్, జిల్లా కన్వీనర్ జక్కోజు వెంకటేశ్వర్లు, జెఏసి నాయకులు జి. భీమాసాహెబ్, జి.తిరుపతి, గురిజాల రవీందర్, గండ్ర వంశీధర్ రెడ్డి, మార్వాడి సుదర్శన్, బి. మోహన్ నాయక్, గుర్రాల రవిందర్, బిజిగిరి నవీన్, శంకర్ నాయక్, ఎం.డి. వాహిజ్, మల్లేష్ యాదవ్, బండి చంద్రశేఖర్, శ్యాం సుందర్, తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *