
జానారెడ్డి భోజనం చేశారు.. అది అలాంటి ఇలాంటి భోజనం కాదు.. పేదలు తినే రూ.5 భోజనం.. జీహెచ్ఎంసీ హైదరాబాద్ లో పేదల ఆకలి తీర్చేందుకు ప్రవేశపెట్టిన రూ.5 భోజనాన్ని జానారెడ్డి ప్రత్యేకంగా తెప్పించుకున్నారు. ఇది నాణ్యత లేదంటూ ఫిర్యాదులు వచ్చాయంటూ ఆయన విలేకరులను కూర్చొబెట్టి భోజనం తినడం మొదలుపెట్టారు..
తిన్నాక సాంబారును పల్లెం లావట్టి జుర్రుకున్నారు..
అనంతరం భోజనం బాగుంది.. ఇంకో ప్లేట్ తేవయ్య అని పీఏ కు ఆర్డర్ ఇచ్చారు.. పాపం జానారెడ్డి జీహెచ్ఎంసీ భోజనం బాగాలేదని చెప్పబోయి.. ఇలా బాగుందని ఫ్రీ పబ్లిసీటీ విలేకరులముందే ఇచ్చారు.. ఈ దెబ్బకు ఆయన నవ్వులపాలయ్యారు..