Breaking News

జాతీయ స్దాయి శిక్షణ సంస్దల తరహ వారధిలో శిక్షణ

జాతీయ స్దాయి శిక్షణ సంస్దల తరహ వారధిలో శిక్షణ

కరీంనగర్: జాతీయ స్దాయి శిక్షణా సంస్దల తరహలో వారధిలో శిక్షణ ఏర్పాట్లు చేస్తామని కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బి.వినోద్ కుమార్ అన్నారు. శనివారం కలెక్టరేటు ఆడిటోరియంలో బ్యాంక్ ప్రొబేషనరి, క్లర్క్ పరీక్షలు వ్రాయించి అభ్యర్ధులకు వారధిచే ఉచిత శిక్షణా తరగతులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేరొందిన శిక్షణా సంస్దల నుండి స్టడీ మెటీరియల్ పొంది వారధి ద్వారా అందజేస్తామని అన్నారు. వారధిలో శిక్షణ పొందిన యువత ఒక మంచి శిక్షణా సంస్ధలో శిక్షణ పొందామనే తృప్తి కలిగేలా చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. గెలుపోటములు సమానంగా చూడాలని, ఓటమే గెలుపుకు మార్గం చూపుతుందని, రాబోయే నాలుగేళ్లలో బ్యాంకింగ్ రంగంలో లక్షలాది ఉద్యోగ ఖాళీలు ఏర్పడుతాయని దీనిని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు. పట్టుదలతో శ్రమిస్తే విజయం సిద్దిస్తుందని ఆయన అన్నారు. యువత తమ నైపుణ్యాన్ని మెరుగుపర్చుకోవాలని, నైపుణ్యంతోనే గుర్తింపు వస్తుందని అన్నారు. ఎప్పుడూ ఆశను వదులుకోవద్దని, జీవితంలో మొదట లక్ష్యాన్ని నిర్దారించుకోవాలని  తదుపరి అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ద్వారా గ్రంధాలయాలతో పాటు వారధి సంస్ధకు పంపిణి చేయతలపెట్టిన స్టడీ మెటీరియల్ ను వారధి కార్యదర్శికి అందజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న జాయింట్ కలెక్టర్ పౌసుమి బసు మాట్లాడుతూ, వృత్తిని గౌరవించాలని, ఏ వృత్తి చేపట్టిన దానిలో రాణించి, ఆ వృత్తికి గౌరవం తేవాలని అన్నారు. ప్రభుత్వంచే ఇస్తున్న శిక్షణా కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సాంఘీక సంక్షేమ శాఖ, బి.సి. సంక్షేమ శాఖ ఉప సంచాలకులు యాదయ్య, మంజుల, వారధి కార్యదర్శి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

bank......       bank...

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *