జాతీయ వైద్యుల దినోత్స‌వం నాడు మొక్క‌లు నాటిన డాక్ట‌ర్లు

జాతీయ వైద్యుల దినోత్స‌వం నాడు మొక్క‌లు నాటిన డాక్ట‌ర్లు
 జాతీయ డాక్ట‌ర్ల దినోత్స‌వం సంద‌ర్భంగా జూబ్లీహిల్స్ రోడ్ నెం.1లో మొక్క‌నాటుతున్న డాక్ట‌ర్ సంధ్య త‌దిత‌రులు
 స‌మాజ సేవను అంద‌రూ బాధ్య‌త‌గా తీసుకోవాల‌ని ఎవిస్ హాస్పిట‌ల్స్ అధినేత‌, ప్ర‌ముఖ ఇంట‌ర్వెన్ష‌న‌ల్ రేడియోల‌జిస్ట్ డాక్ట‌ర్ రాజా. వి.కొప్ప‌ల అన్నారు. జాతీయ వైద్యుల దినోత్స‌వం సంద‌ర్భంగా బుధ‌వారం జూబ్లీహిల్స్ రోడ్డు నంబ‌ర్‌-1లో  ఆస్ప‌త్రి త‌ర‌పున  డాక్ట‌ర్ సంధ్య‌తో మొక్క‌లునాటే కార్యక్ర‌మాన్ని ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా డాక్ట‌ర్ రాజా మాట్లాడుతూ క‌ల‌క‌త్తా మెడిక‌ల్ కాలేజీలో అధ్యాప‌కునిగా జీవితాన్ని ప్రారంభించి, వివిధ సేవా సంస్ధ‌లు, ఆస్ప‌త్రులు నెల‌కొల్పి పేద‌ల‌కు సేవ‌లందించిన డాక్ట‌ర్ బీ.సీ.రాయ్ 14 ఏళ్ల‌పాటు ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా పేరుగాంచార‌ని వివ‌రించారు. బీ.సీ.రాయ్ జ‌యంతిరోజైన జూలై 1 వ తేదీని  భార‌త‌దేశంలో జాతీయ వైద్యుల దినంగా నిర్వ‌హిస్తున్నార‌ని అన్నారు. త‌మ ఎవిస్ ఆస్ప‌త్రి త‌ర‌పున స్వ‌చ్ఛ‌భార‌త్ కార్య‌క్ర‌మంలో భాగంగా జూబ్లీహిల్స్ రోడ్డులో ప్ర‌త్యేక డ‌స్ట్‌బిన్‌ల ఏర్పాటుకు అనుమ‌తి తీసుకున్నామ‌ని తెలిపారు. కాలిబాటలు ద‌త్త‌త తీసుకుని,  ఈ డ‌స్ట్‌బిన్‌ల‌ను త్వ‌ర‌లో  ఏర్పాటు చేస్తామ‌ని, అదేవిధంగా కాళ్ల‌లో ర‌క్త‌నాళాలు ఉబ్బి బాధ‌ప‌డే పోలీసు సిబ్బందికి త్వ‌ర‌లో ఉచిత స్క్రీనింగ్ టెస్ట్ సౌక‌ర్యాన్ని క‌లిగిస్తామ‌ని తెలిపారు. ఈ సంద‌ర్భంగా డాక్ట‌ర్ రాజా,డాక్ట‌ర్ సంధ్య‌ల‌ను సిబ్బంది ఘ‌నంగా స‌త్క‌రించారు.కార్య‌క్ర‌మంలో ఆస్ప‌త్రి అధికార సిబ్బంది ,కుమార్. శ‌శి, రాజేష్ ముర‌ళి,  అచ్యుత్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *