జాతీయ రహదార్లకు నోటిఫికేషన్లు విడుదల చెయ్యాలని కోరిన మంత్రి తుమ్మల

జాతీయ రహదార్లకు నోటిఫికేషన్లు విడుదల చెయ్యాలని కోరిన మంత్రి తుమ్మల

హైద‌రాబాద్: ఉదయం ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కారి ని వారి కార్యాలయములో కలసిన మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు తెలంగాణ రాష్టపార్లమెంట్ సభ్యలు బి.వినోద్ కుమార్, జితేందర్ రెడ్డి, బొర్రానర్స గౌడ్, సీతారాం నాయక్, నగేష్, రాష్ట్ర అధికారులు. ఈ సమావేశంలో తెలంగాణా రహదారుల అబివృద్ది నిమిత్తమై చర్చించారు.కేంద్రంలో పెండింగ్ లో ఉన్న కొన్ని అనుమతుల విషయమై లేఖ అందిచారు.

ఈ లేఖ లో ముఖ్య అంశాలు:

గతంలో కేంద్రం ప్రకటించిన జాతీయ రహదార్లకు నోటిఫికేషన్లు విడుదల చెయ్యాలని కోరిన మంత్రి తుమ్మల

అదే విధంగా ఇప్పటికి జాతీయ రహదార్లగా ఉన్నరోడ్ల నిర్వహణకు కేంద్రం ఇచ్చేనిధులు అరకొరగా ఉండటం సదరు నిర్వహణ భారంగా పరిగణించడం కేంద్రాన్నినిర్వహణ గ్రాంటును పెంచేందుకు కోరిన మంత్రి తుమ్మల.

ఇప్పటి వరకు కేంద్రం ప్రకటించిన 25 నూతనజాతీయరహదార్లకు 3155 కి.మీ నిడివికి అదనంగామరో 1207 కి.మీ నిడివి గల 11 రహదార్లను జాతీయ రహదార్లుగా బదలాయించేందుకు అభ్యర్దించిన మంత్రి

అంత ర్రాష్ట్ర అనుసంధాన పథకంలో భాగంగా రాష్ట్రానికి రూ.190.10 కోట్ల వరకు పథకాలు సిద్ధం చేసి కేంద్ర మంత్రి కి సమర్పించిన మంత్రి తుమ్మల

1. నిర్మల్ జిల్లా లో బై౦సా – పెద్దపల్లి రోడ్డు – రూ. 59.00 కోట్లు

2. భద్రాద్రికొత్తగుడెం జిల్లాలో లక్ష్మినగరం – లక్ష్మీపురం రోడ్డు – 51 కోట్లు

3. ఖమ్మంజిల్లాలోఖానాపురం – గన్నవరం రోడ్డు – రూ:12.40 కోట్లు

4. ఖమ్మం జిల్లాలో మిట్టపల్లి – ఉట్కూర్ (వయ) పెద్ద కోరికొండ – రూ. 33 కోట్లు

5. భద్రాద్రికొత్తగుడెం జిల్లాలో ములకలపల్లి – వెంకటాపురం రోడ్డు – రూ: 34.70 కోట్లు

నకిరేకల్ – మల్లంపల్లి జాతీయ రహదారి 365 పై జమన్లపల్లీ –మంగలవారిపేట్ సెక్షన్ లో 33 కి.మీ నిడివి గల రహదారి పై అటవీ అనుమతుల కొరకు నిలచిన రోడ్డు విస్తరణ పనులకు అనుమతులకు అభ్యర్ధన.

జడ్చర్ల – దేవరకొండ సెక్షన్ జాతీయ రహదారి 167 పై రహదారి పనులు విస్తరణకు రూ:114.23 కోట్ల ప్రతిపాదనల అనుమతులకు విన్నపం.

హైదరాబాద్ పట్టణం చుట్టూ ప్రాంతీయ బాహ్య వలయ రహదారి నిర్మాణానికి నిదులు మంజురు కొరకు అభ్యర్దించిన మంత్రి సంగారెడ్డి – నర్సాపూర్ – తూప్రాన్ – గజ్వేల్ – జగ్దేవ్పుర్ – భువనగిరి – చౌటుప్పల్ – ఇభ్రహింపట్నం – చేవెళ్ళ – శంకరపల్లి – కంది

nithin gatkari 1

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *