
జిల్లాలోని జాతీయ రాష్ట్ర్ర రహదారులపై భద్రతను మరింత పెంపొందించనున్నామని జిల్లా ఎస్.పి డి.జోయల్ డేవిస్ అన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఐదు ప్రత్యేక వాహనాలను రహదారుల భద్రత కోసం కేటాయించడం జరిగిందని పేర్కొన్నారు. జిల్లా నేరసమీక్షా సమావేశం గురువారంనాడు జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లోని దివంగత ఉమేష్ చంద్ర కాన్ఫరెన్ష్ హల్లో జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో జిల్ల్లా ఎస్.పి డి.జోయల్ డేవిస్ మాట్లాడుతూ రహదారుల భద్రతలో భాగంగా జిల్లా సరిహద్దు శనిగరం నుండి కరీంనగర్, జగిత్యాల నుండి మధ్యలో రేయింబవళ్లు పెట్రోలింగ్ కొనసాగుతుందన్నారు. దీంతో రహదారులో దోపిడి, దొంగతనాలు, చైన్ స్నాచింగ్ లు, డ్రంకెన డ్త్ర్రెవ్, ఓవర్ స్పీడ్ రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని చెప్పారు. జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో మరిన్ని సిసి కెమెరాలను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. అనేక ప్రాంతాల ప్రజలు స్వచ్చందంగా ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు. నేరాల నియంత్రణ, చేదనకు కెమెరాలు దోహదపడతాయని తెలిపారు. పోలీస్ స్టేషన్లకు వచ్చే ప్రజలకు కనీస మర్యాదనిచ్చి ఫిర్యాదులను స్వీకరించాలని సూచించారు. నేరాల నియంత్రణ, దొంగిలించబడిన సొత్తు రికవరీల కోసం సర్కీళ్ల వారీగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్.పి టి.అన్నపూర్ణ, ఓ.ఎస్.డి ఎల్. సుబ్బరాయుడు, గోదావరిఖని ఎ.ఎస్.పి విష్ణు ఎస్.వారియర్, ట్ల్ర్రెనీ ఐపిఎస్ అధికారిణి సింధూశర్మ, ఎస్.బి డి.ఎస్.పి సి.ప్రభాకర్, పెద్దపల్లి, కరీంనగర్, సిరిసిల్లా, జగిత్యాల డి.ఎస్.పిలు మల్లారెడ్డి, జె.రామారావు, సుధాకర్,
రాజేంద్రప్రసాద్, ఎస్.బి.ఐ సతీష్ చందర్ రావు తదితరులు పాల్గొన్నారు.