
అంతర పాఠశాలల క్రిప్టిక్ క్రాస్‌వర్ట్ సిసిసిసి పోటీలు-2018లో పికెట్‌లోని కేంద్రీయ విద్యాలయానికి చెందిన కాత్సయని, జాహ్నవిలు ఫైనల్‌కు చేరుకున్నారు. హైదరాబాద్ సిటీ రౌండ్ స్థాయిలో నిర్వహించిన ఈ క్రిఫ్టిక్ క్రాస్ వర్ట్ పోటీల్లో విశాఖపట్నం కేంద్రీయ విద్యాలయానికి చెందిన డి. స్నేహ, బి.జోత్స్నలు ద్వితీయ స్థానంలో నిలిచారు. రామంతపూర్‌లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో నిర్వహించిన ఈ క్రిప్టిక్ క్రాస్ వర్ట్ పోటీలకు 35 పాఠశాలల విద్యార్థీనీ, విద్యార్థులు హాజరయ్యారు. 9నుండి 12వ తరగతి మధ్య విద్యార్థినీవిద్యార్థులో క్రాస్‌వర్ట్ సమస్యా పూరక పోటీలను ప్రతి సంవత్సరం సిసిసిసి అనే పేరుతో 2013 సంవత్సరం నుండి నిర్వహిస్తున్నారు. దేశ వ్యప్తంగా 41 సీటి రౌండ్లలో ఈ క్రాస్‌వర్ట్ పోటీలను నిర్వహించి సిటీ రౌండ్‌లలో అగ్రస్థానం పొందిన వారు న్యూఢిల్లీలో నిర్వహించే గ్రాండ్ ఫైనల్‌లో పాల్గొంటారు. 2013లో బిహార్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ న్యూఢిల్లీలో ప్రారంభించిన ఈ క్రాస్‌వర్ట్ పోటీలకు నవోదయ విద్యాలయ సంఘటన, కేంద్రీయ విద్యాలయ సంఘటన, దూరదర్శన్‌లు ఈవెంట్ పార్ట్‌నర్‌లుగా ఉన్నాయి.