జాతీయ కామర్స్ కాన్ఫరెన్స్ సమావేశంలో ప్రసంగించిన మంత్రి కడియం శ్రీహరి

మార్కెటకనుగుణంగా కామర్స్ లో కొత్త కోర్సులు రూపొందించాలి

ఐటి, కామర్స్ కలిపి అద్బుతమైన డిజిటల్ కామర్స్ కు తెలంగాణ నుంచే పునాదులువేయాలి

ఉస్మానియా యూనివర్శిటీ వీసీ, కంప్యూటర్ ప్రొఫెసర్ ఎస్. రామచంద్రం, పాలమూరు యూనివర్శిటీ వీసీ, కామర్స్ ప్రొఫెసర్ రాజారత్నం ఇద్దరు కలిసి ఈ పనికి పూనుకోవాలి

కామర్స్ లో ఉన్న అవకాశాలను మన యువతకు అందించేలా కొత్త కోర్సుల రూపకల్పన జరగాలి

బ్యాంకింగ్ రంగంలోని అవకతవకలు అరికట్టేలా కామర్స్ విభాగం పనిచేయాలి

బ్యాంకింగ్ వ్యవస్థపై సామాన్యులకు నమ్మకం పోయేలా కుంభకోణాలు జరుగుతున్నాయి…మదుపర్ల డబ్బుకు భద్రత భయం నెలకొంది

జిఎస్టీ వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఏటా రెండువేల కోట్ల రూపాయల నష్టం.. దీనిని పూడ్చేందుకు కేంద్రం నుంచి హామీ ఉన్నా..సరైన విధానం
ఇప్పటికీ రూపకల్పన జరగలేదు.

డీమానిటైజేషన్ వల్ల కూడా తెలంగాణ రాష్ట్రం రెవెన్యూ పడిపోయింది..సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు

డిజిటల్ కామర్స్ ద్వారా పన్నుల విధానం సులభతరం చేయాలి..

యూనివర్శిటీలలో ఖాళీలను భర్తీ చేసేందుకు అనుమతులిచ్చినా…యూనివర్శిటీలు వాటిని భర్తీ చేసేందుకు ఆలస్యం చేస్తున్నాయి…కొత్త యూజీసీ మార్గదర్శకాల కోసం ఎదురు చూస్తున్నాయి

యూనివర్శిటీలలో మంజూరు చేసిన 1061 పోస్టులను వెంటనే భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టాలి

 ‘‘డిజిటల్ కామర్స్ – అవకాశాలు, సవాళ్లు’’ అనే అంశంపై తెలంగాణ కామర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన మొదటి జాతీయ కామర్స్ కాన్ఫరెన్స్ సమావేశంలో ప్రసంగించిన ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి

సమావేశంలో పాల్గొన్న తెలంగాణ ప్రభుత్వ సలహాదారు పాపారావు, ఉస్మానియా యూనివర్శిటీ వీసీ ఎస్. రామచంద్రం, పాలమూరు యూనివర్శిటీ వీసీ రాజారత్నం, తెలంగాణ కామర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, బద్రుకా కాలేజీ ప్రిన్సిపాల్, కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం కామర్స్ ప్రొఫెసర్ విశ్వనాథం, కాకతీయ యూనివర్శిటీ కామర్స్ ప్రొఫెసర్ ఎ. శంకరయ్యలను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సన్మానించారు.

తెలంగాణ కామర్స్ అసోసియేషన్ సావనీర్ ను మెజీషియన్ రమ్య బయటకు తీయగా…ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి విడుదల చేశారు.

మెజీషియన్ రమ్య విజ్ణప్తి మేరకు మెజీషియన్ దండం పట్టుకుని సావనీర్ ను బయటకు తీసుకొచ్చిన ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి

KADIYAM SRIHARI 1 kadiyam srihari 2  kadiyam srihari 3

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *