Breaking News

జాతర ఫిబ్రవరి(1-7) ఎడిషన్ విడుదల

Jathara-edition

హైదరాబాద్, ప్రతినిధి : ఆద్యంతం రంగుల హంగులతో రాజకీయ ఆటుపోట్లను ఎత్తిచూపుతూ.. నేతలకు తగిలేలా సవిరణ కథనాలతో దుమ్ము రేపుతున్న జాతర వార పత్రిక ఫిబ్రవరి మొదటి వారం ఎడిషన్ విడుదలైంది. రాజకీయాల్లో లొసుగులు.. నేతల అవినీతి దందాలు.. అధికారపార్టీ అక్రమాలను ఈ ఎడిషన్ లో పొందుపరిచారు.

ప్రధానంగా కాంగ్రెస్ నాయకుల ఉదాసీనతపై ఇటీవల హైదరాబాద్ లో నిర్వహించిన సమీక్షలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఫైర్ అయ్యారంటూ.. ప్రభుత్వంపై ఇక యుద్ధానికి సిద్ధం కావాలంటూ ‘ఇక అటాక్’ అంటూ ప్రత్యేక కథనం బ్యానర్ గా ప్రచురించారు. దాంతో పాటు కేసీఆర్ మంత్రివర్గ మార్పులు, రాజయ్య ఔట్.. కడియం శ్రీహరి ఇన్ పై స్టోరీ ‘ఆయన ఔనంటే మంత్రి’ కాదంటే ‘కంత్రి’ పేరు మీద ప్రత్యేక స్టోరీ వేశారు. ఇది చదివించేలా ఉంది. దాంతో పాటు ‘పాపం రాజయ్య’ అంటూ మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య వ్యవహారంపై కథనం.. టీఆర్ఎస్ లో రాజయ్య తరువాత ఏ మంత్రి కేసీఆర్ టార్గెట్ అంటూ కథనంతో ఈ వారం విడుదలైంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *