జాతరలో సహకరించిన భక్త జన కోటికి, అధికారులకు, సిబ్బందికి పేరు, పేరునా ధన్యవాదాలు: ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి

జాతరలో సహకరించిన భక్త జన కోటికి, అధికారులకు, సిబ్బందికి పేరు, పేరునా ధన్యవాదాలు – ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ కడియం శ్రీహరి

మేడారం జాతరను ప్రశాంతంగా విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు

జాతరకు వచ్చి సహకరించిన ముఖ్య అతిధులందరికీ కృతజ్ణతలు

జాతరలో మొక్కులు చెల్లించి…200 ఎకరాల భూమి, 200 కోట్ల రూపాయలు మంజూరు చేసిన సిఎం కేసిఆర్ కు ప్రత్యేక ధన్యవాదాలు

తెలంగాణ ప్రభుత్వం, ప్రజలు, భక్తులపై తల్లుల ఆశీర్వాదం వల్లే జాతర విజయవంతం..అమ్మల ఆశీర్వాదం ఇలాగే ఉండాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆకాంక్ష

మేడారం, ఫిబ్రవరి 03 : ప్రపంచంలోనే అతిపెద్ద ఆదివాసి జాతర…దక్షిణ భారతదేశ కుంభ మేళా…తెలంగాణ రాష్ట్ర పండగ…సమ్మక్క-సారక్కల మేడారం జాతర…ఈసారి కనివినీ ఎరుగని రీతిలో గొప్పగా జరిగింది. ఈ జాతర కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక ఏర్పాట్లు చేసింది. ఊహించిన దానికంటే పెద్ద సంఖ్యలో భక్తులు మేడారానికి తరలి వచ్చి వనదేవతలను దర్శించుకున్నారు. నిలువెత్తు బంగారాన్ని భక్తితో సమర్పించి మొక్కులు చెల్లించి అమ్మల ఆశీర్వాదాలు పొందారు. మేడారం జాతర ప్రారంభానికి 15 రోజుల ముందునుంచే తరలి వచ్చి తల్లులను కొలిచారు. తెలంగాణ జాతరను ప్రపంచవ్యాప్తంగా తెలిసేలా అత్యంత భక్తి,శ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో విజయవంతం చేసినందుకు ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి భక్తులు, అధికారులు, సిబ్బంది ఇలా అక్కడకు వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు,పేరునా ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం పెద్ద ఎత్తునా ఏర్పాట్లు చేసినా…లక్షలాదిగా తరలివచ్చిన భక్తులు తల్లుల మీద ఉన్న భక్తితో భక్తులు సంయమనం పాటించి సహకరించినందుకు భక్త కోటికి కృతజ్ణతలు తెలిపారు. సమ్మక్క-సారక్కల జాతర అంటేనే భక్త జన సంద్రం. అనేక మంది ముఖ్య అతిధులు అమ్మలను దర్శించేందుకు నేరుగా వచ్చి మొక్కులు చెల్లించుకున్నారని, ప్రభుత్వానికి సహకరించారని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. గౌరవ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, చత్తీస్ ఘడ్ గౌరవ ముఖ్యమంత్రి రమణ్ సింగ్, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ముఖ్యులు, ఇతర దేశాల నుంచి వచ్చిన భక్తులు జాతరకు వచ్చి తెలంగాణ ప్రభుత్వ ఆతిధ్యాన్ని స్వీకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు.

ముఖ్యమంత్రి కేసిఆర్ తెలంగాణ రాష్ట్రం రాకముందు అమ్మలను కొలిచి తెలంగాణ రాష్ట్రం వస్తే మళ్లీ వస్తానని మొక్కుకుని, ఈసారి ఆ మొక్కును తీర్చుకునేందుకు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి నిలువెత్తు బంగారాన్ని సమర్పించుకున్నారు. జాతరలో తల్లులను దర్శించుకునేందుకు భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించాల్సిన పరిస్థితిని స్వయంగా గమనించారు. జంపన్నవాగును మరింత అభివృద్ధి చేసి పుణ్య స్నానాలకు అనుగుణంగా మార్చాలనుకున్నారు. అందుకే మేడారం జాతరలో శాశ్వత ప్రాతిపదికన వసతుల కల్పనకు 200 కోట్ల రూపాయలను ఈసారి బడ్జెట్ లో పెట్టి వచ్చే జాతర నాటికి వాటిని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. సమ్మక్క- సారక్కల జాతరలో శాశ్వత వసతుల కల్పనకోసం 200 ఎకరాల భూమిని సేకరించి ఇస్తామన్నారు. జంపన్నవాగు వద్ద మరొక బ్రిడ్జి నిర్మించి భక్తులకు మరింత సౌకర్యవంతంగా మారుస్తామని హామీ ఇచ్చినందుకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి గౌరవ ముఖ్యమంత్రి కేసిఆర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అంతే కాకుండా దాదాపు కోటిన్నర మంది భక్తులు కొలిచే సమ్మక్క-సారక్కల జాతరను జాతీయ పండగగా గుర్తించేందుకు కేంద్రంపై ఎంపీల ద్వారా ఒత్తిడి చేస్తామని చెప్పినందుకు మరోసారి కృతజ్ణతలు తెలిపారు. మేడారం జాతరకు విస్తృత ప్రచారం కల్పించి, జాతరలో భక్తుల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి వాటిని పరిష్కరించే విధంగా దోహదపడి సహకరించిన మీడియా మిత్రులకు, మీడియా సంస్థలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన ఆదివాసి జాతరను గొప్ప జాతరగా మార్చి, ప్రశాంత వాతావరణంలో కన్నుల పండవగా నిర్వహించడంలో సహకరించిన భక్తులు, ముఖ్య అతిధులు, అధికారులు, సిబ్బంది అందరికీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తల్లుల ఆశీర్వాదంతో ఈ జాతర ప్రశాంతంగా విజయవంతమైందని, ఆ తల్లుల ఆశీర్వాదం తెలంగాణ ప్రభుత్వంపై, అక్కడికి వచ్చే భక్తులపై, జాతరలో పాల్గొన్న ప్రతి ఒక్కరిపై ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనసారా ఆకాంక్షించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *