Breaking News

జాక్ పాట్ కొట్టిన లక్నో స్టూడెంట్స్

72_iiml

లక్నో : బాగా చదవిన విద్యార్థులకు భవిష్యత్తు ఉంటుందని నిర్ధారణ అయ్యింది. ప్రతిష్టాత్మక ఐఐఎం  -లక్నో బ్యాచ్ ఈ సంవత్సరం విద్యార్థులు జాక్ పాట్ కొట్టారు. మొత్తం 446మంది 30వ బ్యాచ్ విద్యార్థులందరికీ దేశీయ, అంతర్జాతీయ సంస్థల్లో కొలువులు దక్కాయి. అసెంచర్, ఆదిత్య బిర్లా గ్రూప్, అమేజాన్, అవెండస్, ఫ్లిప్ కార్ట్, హిందూస్తాన్, యూనిలీవర్, పీ అండ్ జీ, మాస్టర్ కార్డ్ తో పాటు విదేశీ సంస్థల్లో కోట్ల సాలరీలతో కొలువులు పొందారు..

దాదాపు 160 ప్రముఖ సంస్తలు విద్యార్థులను ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేసుకున్నాయి.. దాదాపు అందరూ విద్యార్థులు క్యాంపస్ ఇంటర్వ్యూల్లో సెలక్ట్ కావడంతో ఐఐఎం లక్నో యాజమాన్యం హర్షం వ్యక్తం చేస్తోంది. ఇలా ఒక యూనివర్సిటీలో అందరూ ఎంపికకావడం అరుదుగా చెబుతున్నారు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *