
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు షాదనగర్ లోని జహంగీర్ ఫిర్ దర్గాను ఈనెల 10వ తేదీన సందర్శించనున్నారని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ గారు అన్నారు. ఇందులో భాగంగా ఆయన ఆదివారం జహంగీర్ ఫిర్ దర్గాను సందర్శి0చి ఏర్పాట్లను పరిశీలించారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీతో పాటు ఎం పి జితేందర్ రెడ్డ గారు,స్థానిక ఎం ల్ ఏ అంజయ్య యాదవ్ గారు, బోధన్ ఎం ల్ ఏ షకీల్ గారు, ఎం ల్ సి మరియు వక్ఫ్ బోర్డ్ చైర్మన్ సలీం గారు,మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ అక్బర్ హుస్సేన్ గారు,డిప్యూటీ మేయర్ ఫాసిబాబా గారు దర్గాను సందర్శించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలు తమ మొక్కులను తీర్చుకొనేందుకు దర్గాకు వస్తారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా తన మొక్కును తీర్చుకొనేందుకు ఈ నెల పదోతేదీన దర్గాకు వస్తున్నారని, తన సొంత ఖర్చులతో నియాజ్ చేస్తారని వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ ప్రాంత అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి సారించారని, అందులో భాగంగానే రోడ్లు, తాగునీటి సమస్య తదితర సమస్యలను త్వరితగతిన పూర్తి చేయనున్నామని, ఈ ప్రాతంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం,పలు అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పదోతేదీన వివరిస్తారని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ గారు తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు, ఉద్యమ కాలంలో కేసీఆర్ గారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం మొక్కుకున్నారని, ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మొక్కు తీర్చుకోడానికి వస్తున్నారని వివరించారు. దేశ వ్యాప్తంగా ఈ దర్గాను సందర్శించడానికి భక్తులు వస్తుంటారని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ తెలిపారు.
ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్, షాదనగర్ rdo, కొత్తూరు mro వక్ఫ్ బోర్డ్ ceo ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
*TRS పార్టీలో చేరిన Tdp,congress 500 మంది కార్యకర్తలు.
*షాదనగర్ లోని ఈడెన్ గార్డెన్ లో ఉప ముఖ్యమంత్రి మహమ్మద్ మహమూద్ అలీ గారి సమక్షంలో షాదనగర్ mla అంజయ్య యాదవ్ గారి ఆధ్వర్యంలో trs పార్టీ లో చేరిన
నాగులపల్లి సర్పంచ్ రంగయ్య,ఖాజీపల్లి కాంగ్రెస్ కార్యకర్తలు,సోలిపూర్ మాజీ సర్పంచ్ శ్రీశైలం టీడీపీ కి చెందిన పలువురు కార్యకర్తలు trs పార్టీలో చేరినారు.
*తరువాత ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ గారు, స్థానిక ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ గారు రంగపూర్ గ్రామంలో B T రోడ్ శంకుస్థాపన చేశారు.