జల సౌధ సమీక్షలో మంత్రి హరీష్ రావు

తెలంగాణ మైనర్ ఇరిగేషన్ నెట్ వర్క్ సిస్టం రూపొందించాలి.

రాష్ట్రంలోని ప్రతీ చెరువు, కుంటలను నీటితో నింపాలి.

భారీ, చిన్న నీటి ప్రాజెక్టులకు అన్ని చెరువులను, కుంటలను అనుసంధానించాలి.

నెల రోజుల్లో గొళుసు కట్టు చెరువులు, కుంటలను నీటితో నింపే అంశాల పై ప్రణాళికలు సిద్ధం చేయాలి.
జల సౌధ సమీక్షలో మంత్రి హరీష్ రావు.

రాష్ట్రంలో పటిష్టమైన మైనర్ ఇరిగేషన్ నెట్వర్క్ సిస్టం రూపొందించాలని నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. సమైఖ్య రాష్ట్రంలో చెరువులు, కుంటలు నింపాలన్న ఆలోచనే లేదన్నారు. తెలంగాణ ప్రాంతానికి నీరు వదిలితే… ఆంధ్ర ప్రాంతానికి నీరు ఇవ్వలేమన్న ఆలోచనతో అప్పటి పాలకులు ఇక్కడి సాగు నీటి వ్యవస్థలను చిన్నాభిన్నం చేశారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర అవసరాలకు అనుగణంగా ప్రాజెక్టుల రీ-డిజైనింగ్ చేశారని, తెలంగాణలోని బీడు భూముల్లో నీరు పారించేలా ప్రణాళికలు తయారు చేశారని చెప్పారు. సీతారామా ప్రాజెక్టు, కాళేశ్వరం, మహబూబ్ న గర్ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తే… చాలా వరకు రాష్ట్రంలోని సాగు యోగ్యమైన భూమికి నీరు ఇవ్వవచ్చన్నారు. ఇక ప్రభుత్వ రికార్డుల ప్రకారం 250 టీఎంసీల నీటిని మైనర్ ఇరిగేషన్ ద్వారా వినియోగించుకోవచ్చు. కాని ఇప్పటి వరకు ఆ పరిస్థితి లేదన్నారు. రాష్ట్రంలోని అన్ని చెరువులు, కుంటలను ప్రాజెక్టులకు అనుసంధానం చేసి వాటిని నింపాలన్నది ముఖ్యమంత్రి ఆలోచన అని మంత్రి హరీష్ రావు చెప్పారు.

పటిష్టమైన మైనర్ ఇరిగేషన్ నెట్ వర్క్ సిస్టం అభివృద్ధి చేద్దాం.

రాష్ట్రంలోని అన్ని చెరువులు, కుంటలు నింపుకునే అవకాశం పాత ప్రాజెక్టులు, నిర్మాణ దశలో ఉన్న ప్రాజెక్టుల ద్వారా ఉందని మంత్రి హరీష్ రావు చెెప్పారు. ఇప్పటికే మిషన్ కాకతీయలో భాగంగా గుర్తించిన 44 వేల 928 చెరువుల పరిస్థితిని అధ్యయనం చేయాలని ఇంజనీర్లకు సూచించారు. ఈ 44 వేల 928 చెరువుల్లో ఎన్ని గొళుసు కట్లు ఉన్నాయి. ఒక్కోక్క గొళుసులో ఎన్ని చెరువులు ఉన్నాయో పూర్తి లెక్కలు తీయాలన్నారు. జిల్లాల వారీగా, ఆయా మేజర్, మైనర్ ప్రాజెక్టుల పరిధిలో ఉన్న గొళుసు కట్టు చెరువులను గుర్తించాలని మంత్రి సూచించారు. ఆ చెరువులను ఏ ప్రాజెక్టు ద్వారా నీరు నింపవచ్చు. గొళుసు కట్టు చెరువులతో అనుసంధానం కాని చెరువుల పరిస్థితులు ఎంటో తెలుసుకోవాలన్నారు. వాటిని ఎలా అనుసంధానించ వచ్చో దానిపై నివేదికలు తయారు చేయాలన్నారు.

చెరువులు నీటితో నిండితేనే….పర్యావరణ సమతుల్యత

రాష్ట్రంలోని చెరువులను, కుంటలను నీటి తో నింపితే కరవు పరిస్థితులను పారదోలవచ్చని ఈ సమీక్షలో మంత్రి హరీష్ రావు చెప్పారు. చెరువుల్లో నీరు ఉండే ప్రాంతాల్లో సైక్లింగ్ విధానంలో భాగంగా తిరిగి ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారన్నారు. చెరువులు, కుంటల నీటితో నిండితే తెలంగాణ జిల్లాల్లో కరవు పరిస్థితులను జయించడమే కాకుండా, అకాల వర్షాలను, వడగండ్ల వానను నివారించవచ్చన్నారు. పచ్చదనం పెరుగుతుందని తద్వారా పర్యావరణ సమతుల్యత సాధ్యమవుతుందన్నారు. భూగర్భజాలాలు సైతం పెరిగి ఫ్లోరైడ్ వంటి సమస్యలు తగ్గు ముఖం పడతాయన్నారు. ప్రతీ ప్రాజెక్టు నుంచి గొళుసు కట్టు చెరువులు నింపాలన్నది ప్రభుత్వ ఆలోచన అని చెప్పారు. ఇందుకు అనుగుణంగా ప్రాజెక్టు సీఈలు, ఎస్. ఈలు, మైనర్ ఇరిగేషన్ ఇంజనీర్లు నెల రోజుల్లో ప్రణాళికలు తయారు చేయాలని చెప్పారు. వచ్చె నెల తొలి వారంలో మరో మారు ఈ అంశంపై సమావేశమయి చర్చిద్దామన్నారు. రాష్ట్రానికి తెలంగాణ మైనర్ ఇరిగేష్ విధానం రూపొందించి ఇవ్వాల్సిన బాధ్యత ఇరిగేషన్ శాఖలోని ఇంజనీర్లపై ఉందన్నారు.చెరువులు నింపడ ద్వారా రాష్ట్రానికి పూర్థి స్థాయిలో నీటి భద్రత లభిస్తుందన్నారు. ఈ సమీక్ష ప్రారంభానికి ముందు మైనర్ ఇరిగేషన్ వ్యవస్థ, గొళుసు కట్టు చెరువుల తాజా పరిస్థితిని పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా మంత్రికి మైనర్ ఇరిగేషన్ అధికారులు వివరించారు. ప్రతీ ప్రాజెక్టు ఇంజీనర్ల నుంచి ప్రాజెక్టులకు చెరువులు అనుసంధానించడంపై వారి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సమీక్షలో నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, ఈ.ఎన్. సీ మురళీధర్, ఈ.ఎన్. సీ ( అడ్మినిస్ట్రేషన్) నాగేంద్ర రావు , ఈ.ఎన్. సీ కాళేశ్వరం హరిరామ్, ఇరిగేషన్ ఓఎస్డీ శ్రీధర్ దేశ్ పాండే, కాడా కమిషనర్ మల్సూర్, ఆయా ప్రాజెక్టుల సీఈలు, ఎస్. ఈలు, మేజర్, మైనర్ ప్రాజెక్టులకు సంబంధిచిన వివిధ స్థాయిల ఇంజనీర్లు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *