
చిత్తూరు, ప్రతినిధి : చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలో జల్లికట్టు ఉత్సవానికి రంగం సిద్ధమైంది. ఎ.రంగంపేట, రామిరెడ్డిపల్లె, పుల్లయ్యగారిపల్లె, నాగయ్యవారిపల్లెలో జల్లికట్టుకు ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. ఒకవైపు పోలీసులు హెచ్చరికలు జారీ చేసినా.. ఏ పనులు ఆగడం లేదు. మధ్యాహ్నం తర్వాత ఉత్సవం ఆరంభమయ్యే అవకాశం ఉంది. ఎద్దులను సిద్ధం చేసుకుని గ్రామస్తులు జల్లికట్టుకు రెడీ అయిపోతున్నారు.
గత సంవత్సరమే జల్లికట్టు ఆడకూడదని కోర్టు నిషేధం విధించింది. తమిళనాడులో జరిగే జల్లి కట్టుకు రంగం పేటలో జరిగే జల్లి కట్టుకు చాలా తేడా వుందని స్థానికులు తెలుపుతున్నారు. రంగంపేటలో గేదెలకు పలక కట్టి దానికి విలువైన వస్తువును కడతారు. దాని పట్టుకొని వస్తువును పొందటమే ఈ జల్లి కట్టు ఉద్దేశ్యం. గ్రామస్తులు మద్యం మత్తులో పాల్గొన్నా, జంతువులను హింసించినా ఊరుకునేది లేదని ఊరంతా దండోరా వేస్తున్నారు.