జలసౌధ నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు తనిఖీ చేస్తున్న మంత్రి హరీష్ రావు

జలసౌధ నుంచి కాళేశ్వరం తనిఖీ.
ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఇంజనీర్లు, ఏజెన్సీల సైటు ఇంజనీర్లతో ముఖాముఖి.
హైదారాబాద్ నుంచే పనుల పర్యవేక్షణ.
కంట్రోల్ సిబ్బంది పనితీరుపై ఆరా.
కాళేశ్వరంకు సకాలంలో పంపుల సరఫరాకు బి.హెచ్.ఈ.ఎల్. హామీ.

భారత ఇరిగేషన్ నిర్మాణ రంగంలో నూతన శకానికి శ్రీ కారం చుడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు
పనులను వేగవంతం చేయడానికి అధునాతన టెక్నాలజీని ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు
అందిపుచ్చుకున్నారు. జలసౌధలో ఏర్పాటు చేసిన లైవ్ స్క్రీన్ నుంచి మంత్రి హరీష్ రావు కాళేశ్వరం ప్రగతి
ని పర్యవేక్షించారు.మంత్రి లైవ్ లోకి రావడం తో అన్నారం బ్యారేజీలో పని చేస్తున్న అధికార యంత్రాంగం ,
సిబ్బంది నివ్వెర పోయారు. మరింత అప్రమత్తమయ్యారు.కాళేశ్వరం ప్రాజెక్టుకు చెందిన మూడు బ్యారేజీలు,
మూడు పంపు హౌజ్ లు, గ్రావిటీ కెనాల్, గెట్ల ఫ్యాబ్రి కేషన్ పనులను స్వయంగా మూడు రోజుల పాటు
పరిశీలించిన మంత్రి హరీష్ రావు హైదారాబాద్ లోని తెలంగాణ సాగునీటిపారుదల హెడ్ క్వార్టర్ జలసౌధ
నుంచి ఆయా పనుల పురోగతిని ‘లైవ్" లో తనిఖీ చేసే ప్రక్రియను కొనసాగిస్తున్నారు.ఇందులో భాగంగా
శనివారం నాడు అన్నారమ్ బ్యారేజీ పనులను లైవ్ లో పరిశీలించారు.అక్కడ సైటు లో ఉన్న సంబంధిత
ఏజెన్సీ ఇంజనీర్, ఇరిగేషన్ ఇంజనీర్లతో నేరుగా సంభాషించారు.పనులు జరుగుతున్న తీరుతెన్నులను మంత్రి
అడిగి తెలుసుకున్నారు.శనివారం నాడు ఎంత కాంక్రీటు వేశారు? ఎంత టార్గెట్ రీచ్ అయ్యారు? ఎన్ని గేట్లు
ఫ్యాబ్రి కేటు చేశారు ?అని ఇరిగేషన్ ఈ.ఈ .మల్లిఖార్జునప్రసాద్నుంచి వివరాలు తెలుసుకున్నారు. ప్రాజెక్టు
సైటులో ఉండే ప్లేస్ మెంట్ రిజిస్టర్ ను తనిఖీ చేశారు. క్వాలిటీ ఇంజనీర్లు రెగ్యులర్ గా సైటు కు వస్తున్నారా ?
లేదా ? అని ప్రశించారు.క్వాలిటీ కంట్రోల్ సిబ్బంది, ఫీల్డ్ ఇంజనీర్ల విధుల రికార్డులను కూడా మంత్రి
హైదారాబాద్ నుంచే తనిఖీ చేశారు.అన్నారం బ్యారేజీలో జరుగుతున్న అన్నీ పనులను లైవ్ కేమరాలో
చూస్తూ తగిన సూచనలు చేశారు.గత నెల డిసెంబర్ లో ఒక లక్షా నాలు వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీటు
పనులు జరిగాయని సైటు ఇంజనీర్లు మంత్రికి తెలిపారు.జనవరి నుంచి ప్రతి నెల లక్షా 50 వేల క్యూబిక్

మీటర్ల కాంక్రీటు పనుల లక్ష్యంతో పని చేస్తున్నట్టు సైటు ఇంజనీర్లు హరీష్ రావుకు వివరించారు.కాగా
కాళేశ్వరం కు సంబంధించిన
ప్యాకేజీ 6, ప్యాకేజీ 8 లకు గాను అవసరమైన పంపులు, మోటార్లు, ఇతర యంత్ర పరికరాలను సకాలంలో,
షెడ్యూలు ప్రకారం సరఫరా చేస్తామని బి.హెచ్.ఈ.ఎల్.ఉన్నతాధికారుల బృందం తెలంగాణ ప్రభుత్వానికి హామీ
ఇచ్చింది.శనివారం ఈ బృందం ఇరిగేషన్ మంత్రి హరీష్ రావుతో జలసౌధలో ప్రత్యేకంగా
సమావేశమైంది.బి.హెచ్.ఈ.ఎల్ బృందంలో ఆ సంస్థ సలహాదారు నరేంద్రకుమార్,ఇతర ప్రతినిధులు
పి.ఎల్.గజ్ భాయి, ఎస్.కె.గుప్తా, యోగేంద్రపాల్ ఉన్నారు.సమావేశం లో ప్రభుత్వ స్పెషల్. సి.ఎస్. జోషి,
ఈ.ఎన్.సి.మురళీధరరావు,కాళేశ్వరం సి.ఈ. వెంకటేశ్వర్లు, ఈ.ఈ. నూనె శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

IMG-20180106-WA0102 IMG-20180106-WA0099

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *