జలసౌధలో జరిగిన సమీక్షలో మంత్రి హరీశ్ రావు

వరద నీటి ప్రవాహాన్ని ఎప్పటి కప్పుడు అంచనా వేయాలి.

ప్రాజెక్టు ఇంజనీర్లు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలి.

కాలువ గట్లు, చెరువు కట్టలు తెగితే వెంటనే జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని ఇంజనీర్లకు ఆదేశం.

వరద నీటితో నిండుతున్న చెరువులు….

జలసౌధలో జరిగిన సమీక్షలో మంత్రి హరీశ్ రావు.

భారీవర్షాల కారణంగా రాష్ట్రంలోని మేజర్, మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టు  ల్లో వరద నీటి ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో వివరాలపై మంత్రి హరీశ్ రావు జలసౌధలో సమీక్ష నిర్వహించారు.  ప్రస్తుతం కురుస్తున్న వర్షాల వల్ల కృష్ణా బేసిన్ పరిధిలోని మేజర్ ప్రాజెక్టుల్లోకి వరద నీటి ఇన్ ఫ్లో లో పెద్దగా తేడా ఏం లేదని  అధికారులు మంత్రికి వివరించారు. గోదావరి బేసిన్ పరిధిలో మాత్రం కడెం ప్రాజెక్టులో ఇన్ ఫ్లో 50958 క్యూసెక్ లు ఉండగా,  61277 క్యూసెక్కులు అవుట్ ఫ్లో ఉందని చెప్పారు. ఎల్లంపల్లిలో  ఇన్ ఫ్లో 187037 క్యూసెక్కులు ఉండగా, 27 గెట్లు తెరచి 289184 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని 36  మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో, 19 ప్రాజెక్టుల్లో వరద నీరు చేరి నిండుతున్నట్లు ఇంజనీర్లు తెలిపారు. గోదావరి బేసిన్ లో 16 ప్రాజెక్టులు, కృష్ణా బేసిన్ లో 3 ప్రాజెక్టులు నిండుతున్నట్లు వివరించారు. మరో రెండు రోజుల్లో మరో రెండు, మూడు ప్రాజెక్టుల్లోకి వరద నీరు చేరి నిండే అవకాశం ఉందని మంత్రి హరీశ్ రావు అభిప్రాయపడ్డారు. ఆదిలాబాద్ లోని సాత్నాల, మత్తడివాగు ప్రాజెక్టులు, కొమురం భీం ఆసీఫాబాద్ జిల్లాలో ఎన్టీఆర్ సాగర్, పీపీ రావు ప్రాజెక్టు, శ్రీకొమురం భీం ప్రాజెక్టు, మంచిర్యాల జిల్లాలో నీలవాయి, ర్యాలీవాగు, భూపాల జిల్లాలో లక్కవరం, పాలెంవాగు ప్రాజెక్టు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తాలిపేరు, కిన్నెరసాని, పెద్దవాగు ప్రాజెక్టులు వరద నీటితో నిండినట్లు  ఇంజనీర్లు తెలిపారు. గోదావరి బేసిన్ లోని మీడియం ప్రాజెక్టుల ద్వారా 185887 క్యూసెక్కులు ప్రవాహం వస్తుండగా, అవుట్ ఫ్లో 55818 క్యూసెక్కు లుగా ఉన్నట్లు చెప్పారు. కృష్ణా బేసిన్ లో ఖమ్మం జిల్లాలోని వైరా, లంకసాగర్, మహబూబాబాద్ లో బయ్యారం చెరువు ప్రాజెక్టుల్లోకి వరద నీరి చేరి నిండినట్లు చెప్పారు. కృష్ణా బేసిన్ లోని మీడియం ప్రాజెక్టుల ద్వారా ఇన్ ఫ్లో 10054 క్యూసెక్కులు ఉండగా, అవుట్ ఫ్లో కేవలం 519 మాత్రమేనని ఇంజనీర్లు తెలిపారు.

వరద నీటితో నిండిన చెరువులు
—————————————–
భారీ వర్షాల కారణంగా వస్తోన్న వరద నీటితో రాష్ట్రంలోని చెరువులు నిండుతున్నాయని  మంత్రి హరీశ్ రావు చెప్పారు. గోదావరి బేసిన్ లో దాదాపు 50 శాతం  చెరువులు నిండినట్లు తెలిపారు. ఇవాళ్టి సమీక్షలో మైనర్ ఇరిగేషన్ వ్యవస్థలోని చెరువుల్లో వరదనీరు చేరుతున్న  తీరును మంత్రి అడిగి తెలుసుకున్నారు. గోదావరి బేసిన్ పరిధిలో ఆదిలాబాద్ సర్కిల్ లో 2747 చెరువులు ఉండగా వరద నీరు నిండి పొర్లి పారుతున్న ( సర్ ప్లస్ ) చెరువులు 693 ఉన్నాయని, 75 నుంచి 100 శాతం నిండినవి 1290 చెరువులు, 50 నుంచి 75 శాతం నిండిన చెరువులు 404 చెరువులు, 25 నుంచి 50 శాతం  నిండిన చెరువులు 280 చెరువులు, 25 శాతం లోపు నిండినవి 80 చెరువులు ఉన్నట్లు   మంత్రి తెలిపారు. కరీంనగర్ సర్కిల్ పరిధిలో 4526 చెరువులకు గాను పూర్తిగా వరద నీరు నిండి పొర్లి పారుతున్న వి 959 చెరువులు కాగా, 75 నుంచి 100 శాతం నీటితో నిండిన చెరువులు 505, 50 నుంచి 75 శాతం నీటితో నిండినవి 1306 చెరువులు, 25 నుంచి 50 శాతం నిండినవి 275 కాగా, 25 శాతం లోపు నిండిన  చెరువులు 1481 చెరువులు ఉన్నట్లు తెలిపారు. వరంగల్ సర్కిల్ లో 6529 చెరువులకు గాను వంద శాతం కన్నా ఎక్కువ వరద నీటితో నిండిన చెరువులు 2068 కాగా, 75 నుంచి 100 శాతం నిండిన చెరువులు1613 , 50 నుంచి 75 శాతం నిండిన చెరువులు 847, 25 నుంచి 50 శాతం 534 చెరువులు నిండాయని, 25 శాతం లోపు నిండిన చెరువులు1467 అని మంత్రి హరీశ్ రావు చెప్పారు.  ఇక ఖమ్మం సర్కి ల్ లో 3806 చెరువులు ఉండగా వంద శాతం కన్నా ఎక్కువ వరద నీరు  చెేరిన చెరువులు 1572, 75 నుంచి 100 శాతం వరద నీరు చేరిన చెరువులు 1578, 50 నుంచి 75 శాతం వరద నీరు చేరిన చెరువులు 469 కాగా, 25 నుంచి 50 శాతం నీరు చేరిన చెరువులు 139 ఉన్నాయని, ఇక 25 శాతం లోపు వరద నీరు చేరిన చెరువులు 48 మాత్రమేనని చెప్పారు. ఖమ్మం  సర్కిల్ పరిధిలో చెరువులన్నీ నీటితో నిండటం పట్ల మంత్రి ఆనందం వ్యక్తం చేశారు. నిజామాబాద్ సర్కిల్ పరిధిలో 2513 చెరువులకు గాను, 12 చెరువుల్లో వంద శాతం కన్నా ఎక్కువ వరద నీరు చేరిందని, 75 నుంచి 100 శాతం వరద నీరు చేరిన చెరువులు 94 , 50 నుంచి 75 శాతం వరద నీరు చేరిన చెరువులు 197 కాగా, 25 నుంచి 50 శాతం వరద నీరు  చెరిన చెరువులు 617 కాగా, 25 శాతం లోపు నీరు చేరిన చెరువులు 1593 ఉన్నాయని మంత్రి తెలిపారు. ఇక కృష్ణా బేసిన్ లోని సంగారెడ్డి సర్కిల్ పరిధిలో 8748 చెరువులు ఉండగా 75 నుంచి వంద శాతం వరద నీరు చెరిన చెరువులు 80 కాగా, 50 నుంచి 75 శాతం వరద నీరు చేరిన చెరువులు 83, 25 నుంచి 50 శాతం నీరు చేరిన చెరువుల సంఖ్య 544 కగా 25 శాతం లోపు నీరు చేరిన చెరువులు 8041 చెరువులు ఉన్నట్లు మంత్రి చెప్పారు. రంగారెడ్డి సర్కిల్ పరిధిలో 3778 చెరువులకు గాను 23 చెరువులు వంద శాతం కన్నా ఎక్కువ నీరు చేరగా, 75 నుంచి 100 శాతం వరద నీరు చేరిన చెరువులు 32, 50 నుంచి 75 శాతం చెరువులు 83, 25 నుంచి 50 శాతం నీటితో నిండిన చెరువులు 265 ఉండగా, ఇరవై ఐదు శాతం లోపు నీరు చేరిన చెరువులు 3375 ఉన్నాయన్నారు. నల్గొండ సర్కిల్ పరిధిలో 4652 చెరువులు ఉండగా, 15 చెరువులు వంద శాతం కన్నా ఎక్కువ నీరు చేరగా, 75 నుంచి వంద శాతం నీటితో 114 చెరువులు నిండాయని, 50 నుంచి 75 శాతం వరద నీటితో నిండిన చెరువులు 89 కాగా, 25 నుంచి 50 శాతం నీటితో నిండిన చెరువులు 363 కాగా 25 శాతం లోపు నీటితో నిండిన సంఖ్య 4071  అని మంత్రిహరీశ్ రావు చెప్పారు. మహబూబ్ నగర్ సర్కిల్ పరిధిలో 6526 చెరువులు ఉండగా 81 చెరువుల్లో వంద శాతం కన్నా ఎక్కువ వరద నీరు చేరిందని, 75 నుంచి వంద శాతం నీరు చేరిన చెరువుల సంఖ్య 231 కాగా, 50 నుంచి 75 శాతం వరద నీరు చేరిన చెరువులు269, 25 నుంచి 50 శాతం నీటితో నిండిన చెరువులు 1489 కాగా, 25 శాతం లోపు నీటితో నిండిన చెరువులు 6147 అని మంత్రి తెలిపారు. గోదావరి, కృష్ణా బేసిన్ పరిధిలో 43825 చెరువులకు గాను 5385 చెరువులు వంద శాతం కన్నా ఎక్కువ వరద నీరు చేరిందని చెప్పారు. 75 నుంచి 100 శాతం వరద నీరు 5311 చెరగా,  50 నుంచి 75 శాతం వరద నీరు చేరిన చెరువుల సంఖ్య 3492  కాగా, 25 నుంచి 50 శాతం వరద నీరు చేరిన చెరువల సంఖ్య 3334, 25 శాతం లోపు వరద నీరు చేరిన చెరువల సంఖ్య 26303 అని మంత్రి వివరించారు.  వరద నీరు చెరువుల్లో ఇలా చేరడం మిషన్ కాకతీయ ఫలితాలకు సూచిక అని అభివర్ణించారు.

వరద నీటి రాకపై…. ప్రాజెక్టు ఇంజనీర్లు అప్రమత్తంగా ఉండాలి..
—————————————————–
మేజర్, మీడియం, మైనర్ ప్రాజెక్టుల ఇంజనీర్లు భారీ వర్షాల కారణంగా వచ్చి చెరుతున్న వరద నీటిపై 24 గంటలు అప్రమత్తంగా ఉండి గమనించాలని మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో ప్రాజెక్టులోకి , చెరువుల్లో  వచ్చి చేరుతున్న వరద నీటిని ఎప్పటికప్పుడు అంచనా వేయాలన్నారు. తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు కేంద్ర కార్యాలయానికి, ఫ్లడ్ కంట్రోల్ కార్యాలయానికి తెలియజేయాలన్నారు. ఎక్కడైనా కాలువలు, చెరువు కట్టలు తెగే పరిస్థితి ఉంటే ఆయా జిల్లా కలెక్టర్లకు సమాచారం పంపి, ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలన్నారు. ఈ సమీక్షలో ఈఎన్సీలు మురళీథర్, హరిరామ్, నాగేందర్ రావు,  ఇరిగేషన్ ఓఎస్డీ శ్రీధర్ దేశ్ పాండే, చీఫ్ ఇంజనీర్లు శంకర్, సుధాకర్, మధుసూదన్ రావు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *