Breaking News

జర సోచాయించ రాదే..

TRS Cremation(1)

తెలంగాణ ఏర్పడ్డ తర్వాత టీఆర్ఎస్ కు ఓటమి.. మొన్నటి మెదక్ ఎన్నికలు.. నిన్నటి కంటోన్మెంట్ ఎన్నికల్లో సునాయస విజయం సాధించిన అధికార పార్టీకి బుధవారం వెలువరించిన హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఫలితాల్లో దారుణ పరాభావం సంభవించింది. ప్రథమ పాయింట్ల ఓట్లతోనే బీజేపీ అభ్యర్థి రాంచంద్రరావు .. గెలుపొందడం విశేషం.

ఈ ఎన్నికలను టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఏకంగా హైదరాబాద్ స్థానం నుంచి ఎంతో పేరున్న.. తెలంగాణ ఉద్యమ కారుడైన దేవీ ప్రసాద్ ను నిలబెట్టింది. ఈ స్థానంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రతీరోజు మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలను మానిటరింగ్ చేసి పరిశీలించారు. చివరకు ట్రబుల్ షూటర్ హరీశ్ రావుకు హైదరాబాద్ గెలుపు బాధ్యతలు అప్పగించినా ఫలితం మాత్రం వేరోలా వచ్చింది.

ఓటమికి కారణాలేంటి.?
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమికి ప్రధాన కారణం డీఎస్సీ ఇప్పట్లో నిర్వహించం అని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించడమే.. దాంతో పాటు ఉద్యోగుల ఫిట్ మెంటును నగదు రూపంలో కాకుండా బాండ్ల రూపంలో ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడం ప్రధాన కారణం.. తెలంగాణ ఏర్పడి 10 నెలలు గడుస్తున్నా ఉద్యోగ ప్రకటనలు రాలేదు. ఉద్యమకారులుగా పోరాడిన విద్యార్థుల ఆశలు నెరవేర్చడం టీఆర్ఎస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. అలాగే ఉద్యోగులకు ఫిట్ మెంట్ ప్రకటించినా.. అది అమలు చేయలేదు. బాండ్ల రూపంలో ఇస్తామని నగదును ఇవ్వమని చెప్పడం టీఆర్ఎస్ కు ఆశనిపాతం అయ్యింది. ఉద్యోగులు, పట్టభద్రులు ఈ రెండు విషయాల్లో టీఆర్ఎస్ ను చావు దెబ్బతీశారు. అందుకే టీఆర్ఎస్ ఓటమి మూటకట్టుకుంది.

ఈ ఫలితాలతోనైనా సీఎం కేసీఆర్ మేలుకుంటే మంచిది.. ఈ మధ్య ఆయన నిర్ణయాలు, మాటలు వివాదాస్పదమవుతున్నాయి. అధికారంలోనున్నా అని ఆయన దుందుడుగా ముందుక పోతున్నారు. ఎవరి మాట వినట్లేదు. ఎన్నికల వేళ డీఎస్సీ వేయం అని ప్రకటించి విద్యార్థుల ఆగ్రహానికి గురయ్యారు. మోనార్క్ లా వెళ్లకుండా అందిరినీ ఆశలు, ఆశయాలు తీర్చినప్పుడు మిగితా ఎన్నికల్లో గెలుస్తారు. లేదంటే ఇలానే దెబ్బైపోతారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *