
హైదరాబాద్, ప్రతినిధి : సీనియర్ జర్నలిస్ట్ హరిప్రసాద్ ఆకస్మికంగా మృతి చెందటంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాధ సానుభూతి తెలిపారు. హరిప్రసాద్ మృతికి మంత్రులు టి. హరీష్ రావు, కేటీఆర్ సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబానికి తక్షణ సాయంగా టీఆర్ఎస్ తరఫున రూ. 2 లక్షల సాయం అందిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు.