జర్నలిస్ట్ విజయ్ కుమార్ ను అభినందించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

వరంగల్ జిల్లాకు చెందిన సీనియర్ జర్నలిస్ట్, ప్రస్తుతం సీఎం కేసీఆర్ కు పీఆర్వోగా విధులు నిర్వర్తిస్తున్న గటిక విజయ్ కుమార్ తెలంగాణ ప్రజలందరికీ ఉపయోగపడే అద్భుత రచనలు చేశారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రశంసించారు. హైదరాబాద్ లో గురువారం ఉజ్వల ప్రస్థానం, బంగారు బాట పుస్తకాల ఆవిష్కరణ జరిగిన నేపథ్యంలో శుక్రవారం హైదరాబాద్ లో  విజయ్ కుమార్ కు దయాకర్ రావు శాలువా కప్పి సన్మానించారు. పుస్తకాల ప్రతులను మంత్రికి విజయ్ కుమార్ అందించారు. తెలంగాణ రాష్ట్ర చరిత్రను, విముక్తి పోరాటాల నేపథ్యాన్ని, రాష్ట్రం వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలను, అభివృద్ధిని ప్రతి పౌరుడు తప్పక తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నదని మంత్రి దయాకర్ రావు అన్నారు. ఇందుకు విజయ్ కుమార్ రాసిన పుస్తకాలు ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు. ఇటు సీఎం కార్యాలయంలో పీఆర్వోగా, అటు విద్యుత్ కార్యాలయంలో జీఎంగా విధులు నిర్వర్తిస్తూనే, విజయ్ ఇలా రచనలు చేయడం అసాధారణమైన విషయమన్నారు. విజయ్ వరంగల్ బిడ్డ కావడం గర్వకారణమని అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి దయాకర్ రావుకు విజయ్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *