జర్నలిస్ట్ పై నిప్పులు చెరిగిన ఏపీ సీఎం

images

జర్నలిస్ట్ పై నిప్పులు చెరిగిన ఏపీ సీఎం. ……………………….
మీడియా సమావేశంలో ప్రజాశక్తి ప్రతినిధి పై ముఖ్యమంత్రి చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు..
—————————————-
వ్యాఖ్యలు ను ఖండించని జర్నలిస్టులు
—————————————-
ప్రజాశక్తి : ఏపికి స్పేషల్‌ స్టేటస్‌కు మీరు కట్టుబడి వున్నారు? ప్రత్యేక ప్యాకేజీతో సరిపెడతారా? మీరు కేంద్రంతో ఏరకంగా పోరాటం చేయబోతున్నారు?
చంద్రబాబు : ఎందుకు నువ్వు. నువ్వే పేపరివి.

ప్రజాశక్తి : ఏమండి.
చంద్రబాబు : నువ్వే పేపరివి?

ప్రజాశక్తి : నేను జర్నలిస్టుగా ప్రశ్న అడిగాను..
చంద్రబాబు : ఏ పేపరివి అని అడిగాను (ఆగ్రహంగా)?

ప్రజాశక్తి : నేను ప్రజాశక్తి అండి.
చంద్రబాబు : అది. ఇక కూర్చో..కూర్చో తమ్ముడూ కాసేపు. నీ అజెండా వేరే. నువ్వో పొలిటికల్‌ పార్టీ. పొలిటికల్‌ పార్టీ పేపర్‌ పెట్టినప్పుడు రెసిస్టెంట్‌గా ఉండాల. నీ మాదిరి అనుకుంటే నేనొక వంద పేపర్లు పెట్టాలి కదా?

ప్రజాశక్తి : నేను జర్నలిస్టుగా వచ్చానండి?
చంద్రబాబు : ఏ..ఏ..నీ జర్నలిజం..జర్నలిజానికి మీనింగ్‌ వుంది. న్యూట్రల్‌ పేపర్లడిగితే మీనింగ్‌ వుంటుంది. ఒక పొలిటికల్‌ పార్టీ పేపరు పెడితే .. అది కూడా తప్పుడు సమాచారం. పొలిటికల్‌ పార్టీలు పేపర్లు పెట్టకూడదు. ఎందుక‌ని పెట్టకూడదు అన్నానంటే పెడితే ఇలాంటి సమస్యలొస్తాయి.

ప్రజాశక్తి : సార్‌ ఇప్పుడు రాష్ట్రమంతా ఇదే కదా.
చంద్రబాబు : ఏ వినయ్యా. నువ్వు అడగడానికి అర్హత లేదు. కాసేపు కూర్చో.

ప్రజాశక్తి : మీరు సమాధానం చెప్పాల్సిన అవసరముంది కదా?
చంద్రబాబు : నీకు చెప్పాల్సిన అవసరం లేదు. నీకు చెప్పను కూడా కూర్చో.
ఒక పార్టీ అజెండా. వారికేంటి స్పెషల్‌ స్టేటస్‌పై నువ్వేంచేస్తావో చెప్పు. నేను ఇన్ని చెప్పిన తర్వాత కూడా ఎలాంటి విజ్ఞత వున్నవారైనా అర్థం చేసుకుంటాడు. ఏక పక్ష నిర్ణయం..వాళ్లు చెప్పింది నేను చెయ్యాల. ఇప్పుడు నేనేం చెయ్యాల‌ ఆయన చెప్పింది చేస్తే పోరాడాల‌. పోరాడుతా?

ప్రజాశక్తి : సమాధానం అడిగితే..
చంద్రబాబు : ఏ వినయ్యా. కూర్చో. గమ్మున కూర్చో. నేను నీకు చెప్పడంలా ప్రెస్‌కు చెబుతున్నా. రాష్ట్ర ప్రజానీకానికి చెబుతున్నా. ఆ మాదిరి నువ్వ చేస్తే నీకు కూడా మంచిది కాదు. చాలా మందిని చూశా మీలాంటోళ్లందరినీ. నేను ఆల్‌ ఇండియా లెవల్లో చూశా. వరల్డ్‌ లెవల్‌లో చూశా. ఒక్క సారి చెబితే మర్యాద ఉండాల‌. నీ అజెండా ఏంటి నేను కేంద్రంతో పోరాడాల. నీ అజెండా అది. కొన్ని టివిల‌ అజెండా. సరే మీ అజెండాకు నేను పోరాడాను. ఏం జరుగుతుంది పోల‌వరం నిలిచిపోతుంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *