జర్నలిస్ట్ నాగరాజుకు 8.5 లక్షల ప్రభుత్వసాయం

హైదరాబాద్ : క్యాన్సర్ తో బాధపడుతున్న జర్నలిస్ట్ కొప్పుల నాగరాజుకు సీఎం కేసీఆర్ ఆర్థికసాయం మంజూరు చేశారు. సీఎంఆర్ఎఫ్ నుంచి రూ.8.5లక్షలు సీఎం కేసీఆర్ అందజేశారు. నాగరాజుకు సహాయం కోసం ప్రజాగాయకుడు గద్దర్, టీయూడబ్ల్యూజే అధ్యక్షుడు అల్లం నారాయణ, ప్రధాన కార్యదర్శి క్రాంతి లు కలిసి సీఎం కేసీఆర్ కు విన్నవించారు. మంత్రులు కేటీఆర్, ఈటెల కూడా సిఫారసు చేయడంతో ఈ నిధులను విడుదల చేస్తూ సీఎం ఉత్తర్వులు జారీ చేశారు.

ఖమ్మం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక గ్రామవాసి నాగరాజు నిరుపేద దళిత కుటుంబంలో జన్మించారు. చిన్నతనంలోనే తండ్రి చనిపోగా.. అష్టకష్టాలు పడి చదువుకొని జర్నలిస్ట్ అయ్యాడు. క్యాన్సర్ సోకడం హైదరాబాద్ బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. చికిత్స కోసం డబ్బులు అవసరం కావడంతో జర్నలిస్టు మిత్రుల సాయం కోరారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *