జర్నలిస్ట్ ఎ.కే యాదవ్ మృతి సంతాపం

కరీంనగర్ జిల్లా వేములవాడ సాక్షి విలేఖరి ఎ.కే యాదవ్ మృతి పట్ల పలువురు జర్నలిస్టు నాయకులు సంతాపం ప్రకటించారు.ఇండియన్ జర్నలిస్టు యూనియన్, సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్, మాజి సెక్రటరీ జనరల్ వి.శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ రాష్ర్ట వర్కింగ్ జర్నలిస్టుల సంఘం, రాష్ర్ట అధ్యక్షులు నగునూరి శేఖర్, ప్రధాన కార్యదర్శి కే.విరాహత్ అలీ, రాష్ర్ట నాయకులు వై.నరేందర్ రెడ్డి, కే.సత్యనారాయణ, దాసరి కృష్ణా రెడ్డి, అయిలు రమేష్, కోల మహిపాల్ రెడ్డి, ఎ.రాజేష్ కుమార్, టి.యూ.డబ్ల్యు.జె కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్ష కార్యదర్శులు తాడూరి కర్ణాకర్, గండ్ల శ్రీనివాస్, నాయకులు ఎలగందుల రవిందర్, బల్మూరి విజయసింహ రావు, ఈదే మధుకర్ రెడ్డి, కోలా తిరుపతి, ఎమ్.ప్రేమ్ కుమార్, సయ్యద్ లాయక్ పాషా, కే.భద్రాచలం, పిట్టల రాజేందర్, జే.సురేంద్రకుమార్, సిరిసిల్ల శ్రీనివాస్, టి.వి సూర్యం, పి.కే శ్రీనివాస్, తదితరులు తమ ప్రగాడ సంతాపం ప్రకటించారు. జర్నలిస్టుగా, గాయకునిగా, మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకున్న ఎ.కే యాదవ్ మృతి చెందడం అందరిని కంటతడి పెట్టించింది. ఎ.కే యాదవ్ అంత్యక్రియలు గురువారం నాడు వేములవాడలో జరిగాయి. అలాగే కరీంనగర్ ప్రేస్ భవన్ లో ఎ.కే యాదవ్ చిత్రపటానికి పూల మాలలు వేసి, పలువురు జర్నలిస్టులు నివాళులు అర్పించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *