జర్నలిస్టు శివకు మెరుగైన వైద్య సేవలు అందిస్తాం: ములుగు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి

దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడిన ఏటూరునాగారం వార్త విలేఖరి గంప శివకుమార్ కు మెరుగైన వైద్య సేవలు అందిస్తామని ములుగు జిల్లా కలెక్టర్ ర్ నారాయణ రెడ్డి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (ఐజేయూ) నాయకులకు హామీ ఇచ్చారు. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(TUWJ) దాడుల నివారణ కమిటీ రాష్ట్ర కన్వీనర్ అయిలు రమేష్, రాష్ట్ర కార్యదర్శి గాడి పెళ్లి మధు , వరంగల్ రూరల్ జిల్లా కోశాధికారి కామిశెట్టి రాజు శుక్రవారం నాడు ములుగు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ని కలిసి జర్నలిస్టుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దుండగుల దాడిలో గాయపడిన జర్నలిస్టు శివకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అవసరమైతే వరంగల్ కు తరలించాలని అక్కడే ఉన్న జిల్లా వైద్య అధికారిని ఆదేశించారు.

జర్నలిస్టు శివ పై జరిగిన దాడి పట్ల కలెక్టర్ విచారం వ్యక్తం చేశారు. దోషులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని జర్నలిస్ట్ నాయకులకు కలెక్టర్ హామీ ఇచ్చారు. ములుగు జిల్లా కేంద్రంతో పాటు మండల కేంద్రాల్లో పనిచేసే జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలని జర్నలిస్ట్ యూనియన్ నాయకులు అయిలు రమేష్ ,గాడి పెళ్లి మధులు జిల్లా కలెక్టర్ ను కోరారు. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. జర్నలిస్టు శివ సంఘటన విషయంలో తక్షణమే స్పందించి చర్యలు చేపట్టిన ములుగు జిల్లా కలెక్టర్ చింతకుంట నారాయణరెడ్డికి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ పక్షాన అయిలు రమేష్,గాడిపెళ్లి మధు లు కృతజ్ఞతలు తెలిపారు.

తెలంగాణ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ రాష్ట్ర శాఖ తక్షణమే స్పందించి ఏటూరునాగారం వార్త విలేఖరి గంప శివకుమార్ ఆరోగ్య స్థితిగతులను తెలుసుకునేందుకు జర్నలిస్టులపై దాడులు నివారణ కమిటీ రాష్ట్ర కన్వీనర్ ఐలు రమేష్ ,రాష్ట్ర కార్యదర్శి గాడి పెళ్లి మధు లను గురువారం నాడు ఏటూరునాగారం పంపించారు. అక్కడికి వెళ్ళిన జర్నలిస్టుల బృందం ఏటూరునాగారం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శివ కుమార్ ను పరామర్శించారు. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ తనకు అండగా ఉంటుందని శివకుమార్ కు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్లు, నరసయ్య, గంగాధర్ ,వాసు, ప్రభాకర్ ,రమేష్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. అక్కడి నుండి ములుగు చేరుకున్న జర్నలిస్టుల బృందం శుక్రవారం నాడు జిల్లా కలెక్టర్ చింతకుంట నారాయణ రెడ్డిని కలిశారు. జర్నలిస్టుల పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సానుకూలంగా స్పందించిన జిల్లా కలెక్టర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ బృందంలో కోటేశ్వరరావు, వినోద్ ,శ్రీధర్ ,కృష్ణ ,శ్రీనివాస్, సంతోష్ , మహిపాల్, ప్రభాకర్, శ్యామ్ తదితరులు ఉన్నారు .

ailu ramesh     ailu ramesh 2     ailu ramesh 3

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *