జర్నలిస్టుల హెల్త్ కార్డుల కోసం కొత్త దరఖాస్తులు ఇవే…

తెలంగాణలో జర్నలిస్టులకు ప్రభుత్వం హెల్త్ కార్డులను ఇవ్వబోతోంది.. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వర్కింగ్ జర్నలిస్టులు, రిటైర్డ్ జర్నలిస్టులందరూ అక్రిడిటేషన్లు లేకున్నా హెల్త్ కార్డుల కోసం అప్లై చేసుకోవచ్చు.. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.. మొదటి సారి పూర్తి వివరాలతో ఒక దరఖాస్తు రాగా అందులో ఉన్న కొన్ని అంశాలను తొలగించి లేటెస్ట్ మరొక దరఖాస్తు ఇవాళ రిలీజ్ చేశారు. కింద దరఖాస్తులను డౌన్ లోడ్ చేసుకొని నింపండి..

ఇవాళ కొత్తగా మాడిఫై చేసి విడుదల చేసి దరఖాస్తులు ఇవే..

Health1Health2

ఎలా దరఖాస్తు చేయాలి.?
వర్కింగ్ జర్నలిస్టులు, రిటైర్డ్ జర్నలిస్టులందరూ అయా జిల్లాల ప్రెస్ క్లబ్ లలో, హైదరాబాద్ లోని బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లలో దరఖాస్తు ఫారాలు తీసుకోోవాలి. వాటిని నింపాలి. ఇందులో అన్ని పర్సనల్ డిటైల్స్ ఉంటాయి. ఆధార్ ,పాన్ నెంబర్, రేషన్ కార్డు, రేషన్ కార్డు నెంబర్ తదితర వాటిని దరఖాస్తులో నింపాలి. ఆ తర్వతా దరఖాస్తులో మీ ఫొటోను అతికించాలి. రెండో పేజీలో మీ తల్లిదండ్రులు, భార్యపిల్లల పాస్ పోర్టు సైజ్ ఫొటోలను అతికించి వారి ఆధార్ నెంబర్లు, పుట్టిన తేదీ సమాచారాన్ని రాయాలి.. చివరగా ఇదంతా సరైనదే అని ధృవీకరిస్తే మీ దరఖాస్తు పూర్తయినట్టే..

ఎవరికి ఇవ్వాలి.?
పూర్తి చేసిన దరఖాస్తుల్లో ఫొటోలు, ఆధార్ నంబర్లను తప్పనిసరిగా ఉండేలా చూడాలి.. పూర్తయిన దరఖాస్తులను ఆయా జిల్లాల ప్రెస్ క్లబ్ లలో, బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో బాధ్యులకు అందజేయాలి.. వారు జిల్లా కేంద్రంలోని డీపీఆర్వోకు అందజేస్తారు. లేదంటే జర్నలిస్టులు నేరుగా డీపీఆర్వోకు కూడా అందజేయవచ్చు.. కానీ వారు ప్రెస్ క్లబ్ లో అందరివీ కలిపి ఇవ్వండని సూచిస్తారు. కొన్ని జిల్లాల్లో నేరుగా డీపీఆర్వోలే తీసుకుంటున్నారు. మరికొన్ని జిల్లాల్లో ప్రెస్ క్లబ్ బాధ్యులు తీసుకొని వాటిని ప్రభుత్వానికి అందజేస్తున్నారు.

సెప్టెంబర్ 1 వరకే గడువు..
జర్నలిస్టులకు హెల్త్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునే గడువును ఈనెల 28 నుంచి ప్రభుత్వం సెప్టెంబర్ 1 వరకు పొడిగించింది. చివరి తేదీ వరకు చూడకుండా వెంటనే మీ దరఖాస్తులను ప్రెస్ క్లబ్ లలో అందజేయండి..

దరఖాస్తులను ఆధార్ తో అనుసంధానం చేసి ప్రభుత్వం అక్టోబర్ లో హెల్త్ కార్డులు జారీ చేయనుంది

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.