జర్నలిస్టుల హక్కులు సాధించింది మన సంఘమే..

హైదరాబాద్ : తెలంగాణ ఆవిర్భావం తర్వాత జరుగుతున్న టీయూడబ్ల్యూజే తొలి మహాసభలో సంఘం అధ్యక్షుడిగా మీముందు నిలబడడం గర్వంగా ఉందన్నారు అధ్యక్షులు నగునూరి శేఖర్. హైదరాబాద్ నాంపల్లిలోని లలితకళాతోరణంలో జరుగుతున్న టీయూడబ్ల్యూజే ప్రథమ మహాసభల్లో ఆయన పాల్గొని మాట్లాడారు.తెలంగాణ స్వప్నం సాకారమైన వేళ ఆ ఉద్యమంలో మనమూ భాగస్వాములు కావడం నిజంగా అదృష్టమన్నారు. సమైక్య రాష్ట్రంలో జర్నలిస్టుల హక్కుల కోసం పోరాడిన చరిత్ర ఏపీయూడబ్ల్యూజే దే.. ఆ తదనంతరం టీజేఎఫ్ ఏర్పాటుకు, ఆ సంఘం ఉద్యమాలకు సైతం మనం సహకారమందించాం. కానీ కొందరు తెలంగాణ ఏర్పడ్డాక పదవులపై ఉన్న స్వార్థంతో కొందరు పోటీసంఘం పెట్టినా అడ్డుచెప్పలేదన్నారు. కానీ వారు తమ సంఘాన్ని టార్గెట్ చీల్చాలని చూసినా.. చివరకు వారే చీలిపోయి తమ సంఘంలో చేరారని నగునూరి శేఖర్ అన్నారు.

ఏపీయూడబ్ల్యూ చరిత్రలో నిలిచింది..
ఏపీయూడబ్ల్యూజే గత 58 సంవత్సరాలుగా జర్నలిస్టుల హక్కుల కోసం, సంక్షేమం కోసం అలుపెరుగని పోరాటం చేసిందన్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, ఇండియన్ ఎక్స్ ప్రెస్ పత్రికల్లో సమ్మెలకు, ఆందోళనలకు సారథ్యం వహించిన చరిత్ర ఏపీయూడబ్ల్యూజే దన్నారు. వేతన భత్యాలు, వేజ్ బోర్డు కోసం పనిపరిస్తితుల్లో మెరుగుకోసం పోరాటాలు చేశామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పత్రికలు మూతపడితే సిబ్బందికి న్యాయం చేశామని తెలిపారు. నక్సలైట్ల పోరాటాలను వెలుగులోకి తెచ్చామన్నారు. ఎలక్ట్రానిక్ మీడియాకు ప్రాణవాయువు అందించింది ఏపీయూడబ్ల్యూజేదన్నారు. ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో వేజ్ బోర్డు అమలు కోసం ఉద్యమిస్తున్నామన్నారు.

తెలంగాణ సంస్కృతిని పునరుద్ధరించాం..
ఉమ్మడి రాష్ట్రంలో ప్రభావం కోల్పోయిన తెలంగాణ భాష, సంస్కృతిని పునరుద్ధరించిన ఘనత టీయూడబ్ల్యూజే దన్నారు. అందుకు జర్నలిస్టులుగా మనం కృషిచేస్తున్నామన్నారు. అమరుల ఆశయ సాధనకోసం తెలంగాణ జర్నలిస్టులుగా ఈ గడ్డ రుణం తీర్చుకుందామని ఆయన అన్నారు.

అంతర్జాతీయ స్థాయిలో ఐజేయూకు ఒక గుర్తింపు తీసుకొచ్చిన ఐజేయూ మార్గదర్శకంలో టీయూడబ్ల్యూజేను పతకస్థాయికి తీసుకెళ్దామన్నారు. ఐజేయూ సెక్రటరీ జనరల్ గా పనిచేసిన చేస్తున్న నాయకులు మన తెలంగాణకు చెందిన వారే కావడం మనకు గర్వకారణమని.. దేవులపల్లి అమర్, కే.శ్రీనివాసరెడ్డిలు వేసిన దారిలోనే నడుస్తూ ముందుకు పోదామని నగునూరి శేఖర్ అన్నారు.

మహాసభలో ఆత్మీయ అతిథులుగా ఐజేయూ అధ్యక్షులు ఎస్.ఎన్ సిన్హా , ఐజేయూ జనరల్ సెక్రెటరీ దేవులపల్లి అమర్, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు కే. అమర్ నాథ్ పాల్గొన్నారు. ముఖ్య సలహాదారులు కే.శ్రీనివాసరెడ్డి, టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి కే. విరాహత్ అలీ, టీయూడబ్ల్యూజే మీడియా సెల్ కన్వీనర్ అయిలు రమేశ్, తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *