Breaking News

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: స్పీకర్ సిరికొండ మధుసూదనా చారి

IMG20180117132405

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని స్పీకర్ సిరికొండ మధుసూదనా చారి అన్నారు. తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహా సభ కు ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టులకు అక్రిడిటేషన్ లు , ఇళ్ల స్థలాల మంజూరు కు కృ షి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు నగునూరి శేఖర్ మాట్లాడుతూ రాష్ట్రంలో పని చేస్తున్న జర్నలిస్టుల అందరికి ఒకే సారి ఇళ్ల స్థలాలు కేటాయించాలన్నారు. రాష్ట్రంలోని 13000 మంది జర్నలిస్టుల కు ఇళ్లు కట్టిచ్చి ఇస్తే 650 కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని , రాష్ట్ర బడ్జెట్ లో వన్ పర్సెంట్ లో సగం నిధులు కేటాయిస్తే ఏక కాలంలో జర్నలిస్టుల అందరికీ ఇళ్ళు కట్టించి ఇవ్వొచ్చు అన్నారు. 239 జీ ఓ సవరించాలని, ఎలక్ట్రానిక్ మీడియా మాదిరి ఆన్లైన్ మీడియా జర్నలిస్టుల అందరికీ అక్కిరిడిటేషన్ కార్డులు ఇవ్వాలని శేఖర్ డిమాండ్ చేశారు.ప్రధాన కార్యదర్శి విరహత్ అలీ మాట్లాడుతూ తమ సంఘము పోరాటం వల్లనే జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం అవుతున్నాయన్నారు. దేశంలోనే అత్యధిక సభ్యులు గల సంఘము మనదేనన్నారు. రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని విరహత్ అలీ డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఐ జె యూ కార్య వర్గ సభ్యులు దాసరి కృష్ణా రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు దొంతు రమేష్, తెలంగాణ ఆన్లైన్ మీడియా వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అయిలు రమేష్, యూనియన్ వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి, రాష్ట్ర కార్య వర్గ సభ్యులు రాజేష్, వెంకట రమణ, విద్యా సాగర్, గడిపెల్లి మధు, సుధాకర్ రావు తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *