Breaking News

జర్నలిస్టుల సమస్యలపై టీయూడబ్ల్యూజే సమరశంఖం

tuwj

హైదరాబాద్ : తెలంగాణ ఏర్పడి సంవత్సరం న్నరగా పరిష్కారానికి నోచుకోని జర్నలిస్టుల సమస్యలపై తెలంగాణ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సమరశంఖం పూరించింది.. ఐజేయూ, టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జర్నలిస్టులకు హెల్త్ కార్డులు, అక్రిడిటేషన్లు, ఇళ్లస్థలాలు ఇవ్వాలని నిరసన దీక్షకు దిగారు..

tuwj.jpg2

రాష్ట్రం ఏర్పడి ఏడాదిన్నర గడిచిన ఇప్పటివరకు ఉమ్మడి ప్రభుత్వంలో ఇచ్చిన హెల్త్ కార్డులను పునరుద్ధరించలేదని.. దీనివల్ల ఇప్పటికే 200 మంది జర్నలిస్టులు అసువులు బాసారని జర్నలిస్టు నాయకులు వాపోయారు. అక్రిడిటేషన్లు కూడా ఇవ్వకుండా జర్నలిస్టులపై ప్రభుత్వం సవతితల్లి ప్రేమను చూపుతోందని మండిపడ్డారు..

tuwj.jpg23

ఈ నిరసన దీక్షలో ఐజేయూ నాయకులు దేవులపల్లి అమర్, టీయూడబ్ల్యూజే అధ్యక్షులు నగునూరిశేఖర్, ప్రధానకార్యదర్శి విరాహత్ అలీ, సీనియర్ జర్నలిస్టులు కే శ్రీనివాస్ రెడ్డి, అయిలు రమేశ్, నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *