జర్నలిస్టుల సమస్యలపై ఆమరణ దీక్ష

267-1

నిజామాబాద్ : వర్కింగ్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు , హెల్త్ కార్డులు, డబుల్ బెడ్ రూం ఇళ్లు తదితర సమస్యలపై త్వరలోనే పరిష్కారం లభిస్తుందని..ఒక కేసీఆర్ సమస్యలు పరిష్కరించకుంటే తానే ఆమరణ దీక్షకు దిగుతానని తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో సోమవారం జర్నలిస్టు సంఘాల సమావేశంలో ఆయన మాట్లాడారు..

కొన్ని కారణాల వల్ల అక్రిడిటేషన్ల జారీలో జాప్యం అవుతోందన్నారు. జర్నలిస్టుల హెల్త్ కార్డుల కోసం తెలంగాణలోని పదిజిల్లాల నుంచి 24వేల దరఖాస్తులు వచ్చాయని అల్లం తెలిపారు. నిజమైన జర్నలిస్టులకు ఖచ్చితంగా హెల్త్ కార్డులు రావాల్సిందేన్నారు. కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే నాయకులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *