Breaking News

జర్నలిస్టుల సంఘాల్లోనూ ఎన్నికలు అనివార్యం

1potiF

జర్నలిస్టుల ఎన్నికలు ఎప్పుడూ సాధారణంగా ఏకగ్రీవమే.. తమలో ఉన్న సీనియర్ నాయకులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం పరిపాటిగా జరుగుతోంది.. కొన్ని సంవత్సరాల వరకు అలానే జరిగింది.. ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో ఒక్కొక్కరు రెండు సార్లు ఇలానే ఏకగ్రీవంగా ఎన్నికైన వారే..

కరీంనగర్ జిల్లా విషయానికి వస్తే జిల్లా అధ్యక్షులుగా గతంలో అయిలు రమేశ్, ఆ తరువాత తాడూరి కరుణాకర్,  మధ్యలో నగునూరి శేఖర్ ఇలా జర్నలిస్టుల చేత ఏకగ్రీవంగా ఎన్నికై స్ఫూర్తిని చాటారు.

వరంగల్ జిల్లాలో కూడా ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. చాలామంది ప్రెస్ క్లబ్, జిల్లా అధ్యక్ష ఎన్నికల్లో సీనియర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కానీ ఇప్పుడు సీన్ మారింది..

ఒరవడి మారింది..

సీనియర్లు రిటైర్ కావడమో చాలించుకోవడమో చేస్తున్న వేళ జర్నలిజంలోకి ఉడుకు నెత్తురు , యువతరం దూసుకొస్తుంది.. పత్రికల్లో , టీవీల్లో ఇరగదీస్తున్న కుర్రకారు ఇఫ్పుడు జర్నలిజంలో కూడా అదే దూకుడు ప్రదర్శిస్తోంది.. దీంతో జర్నలిస్టుల సంఘంలో కూడా ఎన్నికలు అనివార్యమవుతున్నాయి..

వరంగల్ ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో  పోటీ అనివార్యమవుతోంది.. ఎన్నికలకు ఇంకా కొద్ది రోజులు ఉండగానే సాక్షి టీవీ మిత్రుడు తాను పోటీలో ఉన్నానంటూ ఏకంగా సోషల్ మీడియాలో, బయట ఫ్లెక్సీలతో ప్రచారం మొదలుపెట్టాడు. అక్కడ పోటీని దృష్టా ఎన్నికలు అనివార్యంగా మారాయి.. ఆ మిత్రుడు ప్రచార పర్వంలో భాగంగా పెట్టిన పోస్టర్ ను మీరూ పైన చూడొచ్చు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *