Breaking News

జర్నలిస్టుల సంక్షేమ నిధికి రూ. 10 కోట్ల విడుదల

allam narayana

హైదరాబాద్, ప్రతినిధి : జర్నలిస్టుల సంక్షేమ నిధికి రూ. 10 కోట్లను విడుదల చేస్తూ తయారైన ఉత్తర్వులపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు సోమవారం సంతకం చేశారు. జర్నలిస్టుల అక్రిడిటేషన్‌ కమిటీ నియామకానికి సంబంధించిన ఉత్తర్వులపై కూడా ముఖ్యమంత్రి సంతకం చేశారు. ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణతో శనివారం నాడు జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై సమీక్షించారు. 2014-15 బడ్జెట్‌లో రూ. 10 కోట్లు ఇవ్వడంతో పాటు 2015-16 బడ్జెట్‌లో కూడా రూ. 10 కోట్లు కేటాయించాలని కేసిఆర్‌ నిర్ణయించారు. ఈ డబ్బులను ప్రెస్‌ అకాడమీ ఖాతాలో జమ చేయాలని,బ్యాంకులో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసి వడ్డీగా వచ్చిన డబ్బులతో జర్నలిస్టుల సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. జర్నలిస్టుల అక్రిడిటేషన్‌ కార్డులు, హెల్త్‌కార్డుల మంజూరు కోసం మార్గదర్శకాలు తయారు చేయడానికి అక్రిడిటేషన్‌ కమిటీని కూడా ప్రభుత్వం నియమించింది. సమాచార శాఖ కమీషనర్‌ మెంబర్‌ కన్వీనర్‌గా ఉండే కమిటీలో రామచంద్రమూర్తి, కట్టా శేఖర్‌ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, శైలేష్‌రెడ్డి, వెంకటకృష్ణ, క్రాంతి, గౌరి శంకర్‌, జహీరుద్దీన్‌ అలీ ఖాన్‌, ఆవుల సరిత, వనజ సభ్యులుగా ఉంటారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *