జర్నలిస్టుల సంక్షేమానికి కృషి : మధుసూదనాచారి

వరంగల్ : జర్నలిస్టుల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తామని శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. హన్మకొండలోని హరిత టూరిజం హోటల్ లో నిర్వహించిన ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయూ) జాతీయ కార్యనిర్వహన కమిటీ రెండో రోజు సమావేశంలో తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు , ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, టూరిజం గిరిజన శాఖ మంత్రి చందూలాల్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐజేయూ జాతీయ అద్యక్షులు సిన్హా అధ్యక్షత వహించారు.
స్పీకర్ మధుసూదనాచారి మాట్లాడుతూ అన్ని సంఘటనలు తెలుసుకునేందుకు మీడియానే ఆధారమన్నారు. జర్నలిస్టుల పాత్ర మరింత పెరగాలన్నారు. వరంగల్ లో ఐజేయూ సమావేశాలు నిర్వహించడంపై సంతోషం వ్యక్తం చేశారు.. రాష్ట్ర ముఖ్యమంత్రి జర్నలిస్టుల సంక్షేమానికి కృషిచేస్తున్నారన్నారు. జర్నలిస్టుల కోసం అన్ని పట్టణాల్లో టౌన్ షిప్ లు నిర్మించేందుకు కేసీఆర్ వరంగల్ నుంచే శ్రీకారం చుట్టారన్నారు. జర్నలిస్టులకు అపరిమిత వైద్య ఖర్చులతో ఆరోగ్య కార్డులను ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. జర్నలిస్టుల డేటా ఆన్ లైన్ లో నమోదు చేసి ఆరోగ్య కార్డును అందజేసినట్లు తెలిపారు.

మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ సమాజంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. జర్నలిస్టులందరికీ తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. అర్హులైన ప్రతీ జర్నలిస్టు కు డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టిస్తామన్నారు. ప్రజలకు ఖచ్చితమైన సమాచారాన్ని ఇవ్వాలని.. స్వార్థ పూరిత శక్తుల చేతుల్లో మీడియా ఉండరాదని హరీష్ సూచించారు.

మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ ప్రభుత్వం చేసే మంచి పనులకు జర్నలిస్టులు అండగా నిలవాలన్నారు. సంచలనాలకు పోకుండా నిజాయితీగా వార్తలను అందించాలని కోరారు. టూరిజం శాఖ, గిరిజన శాఖ మంత్రి చందూలాల్ మాట్లాడుతూ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని చెప్పారు.
కార్యక్రమంలో ఐజేయూ జాతీయ అధ్యక్షులు ఎస్ఎన్ సిన్హా, కార్యదర్శి దేవులపల్లి అమర్, సీనియర్ జర్నలిస్టు కే.శ్రీనివాస్ రెడ్డి,ఐజేయూ వైస్ ప్రెసిడెంట్ గీతార్థ్ పాటక్, అంబటి అంజేయులు, సబీనా ఇంద్రజిత్, ఐజేయూ జాతీయ కార్యదర్శులు వై నరేందర్ రెడ్డి, ప్రభాత్ దాస్, వీబీ రాజన్, కోశాధికారి ప్రేమ్ నాథ్, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మెంటర్ కే అమర్ నాథ్, తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు నగునూరి శేఖర్, విరాహత్ అలీ, తెలంగాణ ఆన్ లైన్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అయిలు రమేశ్, నాయకులు  దాసరి కృష్ణారెడ్డి, దొంతు రమేశ్, నల్లాల వెంకటరమణ, తుమ్మ శ్రీధర్ రెడ్డి, గాడిపల్లి మధు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *