జర్నలిస్టుల సంక్షేమం కోసం నిధులు కేటాయిస్తాం…

రాష్ట్ర్రంలో జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రతీ ఏటా పది కోట్ల రూపాయల చొప్పున కేటాయిస్తుందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు స్పష్టం చేశారు. చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు ఆర్ధికంగా అందుకోవడంతో పాటు, అనారోగ్యం పాలైన జర్నలిస్టుల కుటుంబాలను ఆర్ధికంగా ఆదుకోవడంతో పాటు, అనారోగ్యం పాలైన జర్నలిస్టు లకు కూడా సహయం అందిస్తామని వెల్లడించారు. ఈ నెల 17న జనహితతో తానే స్వయంగా చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాల కుటుంబాలను కలుసుకుని, వారికి సహయం అందిస్తానని సిఎం కె. చంద్రశేఖర రావు వెల్లడించారు. ప్రగతిభవన్లో జర్నలిస్టుల సంక్షేమంపై సిఎం సమీక్ష నిర్వహించారు. మంత్రి కేటి. రామారావు, ప్రభుత్వ ముఖ్య సలహదారు రాజీవ్ శర్మ, ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు, ప్రభుత్వ సలహదారు రమణాచారి, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, రంగారెడ్డి కలెక్టర్ రఘునందన్ రావు, సీనియర్ జర్నలిస్టులు క్రాంతి, పల్లె రవి, బుద్ద మురళి, సతీష్ తదితరులు పాల్గొన్నారు.
‘‘దేశంలో ఏ రాష్ట్ర్రంలో లేని విధంగా జర్నలిస్టుల సంక్షేమం కోసం తెలంగాణలో చర్యలు తీసుకుంటున్నామన్నారు. గత రెండు బడ్జెట్లలో 10 కోట్ల రూపాయల చొప్పున ఇప్పటికే రూ. 20 కోట్లు కేటాయించామన్నారు. ఈ సారి బడ్జెట్లో కూడా మరో పది కోట్ల రూపాయలను కేటాయిస్తామన్నారు. ఈ డబ్బులతో ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని సిఎం కె.చంద్రశేఖర రావు అన్నారు. చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున ఆర్ధిక సహయం అందిస్తామన్నారు. ఆ కుటుంబాలకు ఐదేళ్ళు వరకు నెలకు మూడు వేల రూపాయల చొప్పున పెన్షన్ అందిస్తామని చెప్పారు. పదవ తరగతి లోపు చదివే పిల్లలుంటే ఇద్దరు పిల్లల వరకు ఒక్కోక్కరికి నెలకు వెయ్యి రూపాయల చొప్పున సహయం అందిస్తాం. జర్నలిస్టుల పిల్లలు విదేశాల్లో విద్యనభ్యసిస్తే వారికి ఓవర్సీస్ స్కాలర్ షిప్ పధకం వర్తింపజేస్తామన్నారు.జర్నలిస్టులు విదేశాలకు వెళ్లి అధ్యయనం చేస్తే తగిన సహయం అందజేస్తామని సిఎం ప్రకటించారు.’’

17 న జనహిత ప్రారంభం:
ప్రగతి భవన్లో భాగంగా నిర్మించిన జనహిత లో వివిధ వర్గాల ప్రజలను స్వయంగా కలుసుకుని వారితో చర్చించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనెల 17న ప్రారంభించనున్నారు. ఆ రోజు కేసీఆర్ పుట్టిన రోజు కూడా కావడం గమనార్హం. జనహితలో మొదటి సమావేశం మరణించిన జర్నలిస్టుల కుటంబ సభ్యులతో ఏర్పాటు చేశారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా విధాన నిర్ణయం తీసుకున్నందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు అల్లం నారాయణ , ఇతర జర్నలిస్టులు కృతజ్ఞతలు తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *