జర్నలిస్టుల వేజ్ బోర్డు సిఫారుసుల అమలుకు త్రైపాక్షిక కమిటీ

11

భువనేశ్వర్ : జర్నలిస్టుల వేతనాల కోసం ఏర్పాటుచేసిన మజీథియా వేజ్ బోర్డు సిఫార్సులను యథాతథంగా అమలు చేయించడానికి కేంద్ర కార్మిక శాఖ అన్ని చర్యలూ తీసుకుంటుందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్ లో జరిగిన ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయూ) 8వ మహాసభల్లో దత్తాత్రేయ ప్రసంగించారు. మజీథియా సిఫార్సుల కోసం కేంద్ర కార్మిక శాఖ ఆధ్వర్యంలో ఒక త్రైపాక్షిక కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు.

ఐజేయూ అధ్యక్షతన జరిగిన మహాసభల్లో యూనియన్ సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్, యూనియన్ సీనియర్ నేత వై.శ్రీనివాసరెడ్డి చేసిన విజ్ఞప్తిపై దత్తాత్రేయ స్పందిస్తూ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులను చట్టం పరిధిలోకి తేవడానికి చట్టాన్ని సవరిస్తామని హామీ ఇచ్చారు. వేజ్ బోర్డు సిఫార్సులు అమలు చేయని యాజమాన్యాలపై విధిస్తున్న జరిమానా మొత్తాన్ని 50 రూపాయల నుంచి అనేక రెట్లు పెంచాల్సిన అవసరం ఉందన్న యూనియన్ నాయకుల అభిప్రాయాలలో కేంద్ర మంత్రి ఏకభవిస్తూ అనుగుణంగా చట్టాలను సవరిస్తామని చెప్పారు.

కార్యక్రమంలో జునాఘడ్ శాసనసభ్యుడు కెప్టెన్ డి.ఎన్ మిశ్రా,ఈటీవీ ఒరియా సంపాదకుడు నీలాంబర్ రథ్ , డెంకనాల్ శాసనసభ్యుడు సరూర్ సామంత్ ఒడిషా జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షుడు ప్రభాత్ దాస్, పిడేయూ అఫీస్ బేరర్లు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ఐజేయూ భాగస్వామ్య, యూనియన్ల అధ్యక్ష, కార్యదర్శులు మహాసభల్లో పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *