జర్నలిస్టుల మహాసభ గ్రాండ్ సక్సెస్

హైదరాబాద్ : టీయూడబ్ల్యూజే మహాసభ కు జర్నలిస్టులు ఉప్పెన లా వచ్చారు. రాష్ట్రం నలుమూలల నుంచి భారీగా తరలి వచ్చారు. ఇన్నాళ్లు తెలంగాణలో రెండు వర్గాలుగా విడిపోయిన జర్నలిస్టులంతా ఈ మహాసభ ద్వారా కలిసిపోయారు. టీజేఎఫ్ అనుబంధ tuwj, tuwj(iju) లుగా ఉన్న రెండు సంఘాల్లో ఇటీవలి కాలంలో ఐజేయూ అనుబంధ టీయూడబ్ల్యూజేలోకి జర్నలిస్టులు వరదలా వచ్చి చేరారు. అల్లం నారాయణ నేతృత్వంలోని సంఘానికి రాజీనామా చేశారు.

harish.jpg2

ఈ నేపథ్యంలో ఆదివారం టీయూడబ్ల్యూజే హైదరాబాద్ లో నిర్వహించిన ప్రథమ మహాసభ గ్రాండ్ గా కొనసాగింది. తెలంగాణ రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, జర్నలిస్టు నాయకులు, ఒక్కటేమేటి అందరూ తరలివచ్చి జర్నలిస్టుల హక్కులు సాధిస్తామని ప్రతిన బూనారు.

ఈ జర్నలిస్టుల మహాసభను చూసి తెలంగాణ వ్యాప్తంగా జర్నలిస్టుల కడుపు చల్లబడింది. ఇలాగే ఐక్యతతో ముందుకు సాగి హక్కులు సాధించాలని కోరుతున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *